Dharani
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నేడు అరుదైన అద్భుతానికి వేదిక కానుంది. దీన్ని అస్సలు మిస్ కావొద్దు అంటున్నారు. ఇంతకు ఏంటా అద్భుతం అంటే..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నేడు అరుదైన అద్భుతానికి వేదిక కానుంది. దీన్ని అస్సలు మిస్ కావొద్దు అంటున్నారు. ఇంతకు ఏంటా అద్భుతం అంటే..
Dharani
మన జీవితంలో కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి వాటిని మిస్ చేసుకుంటే.. వాటిని మళ్లీ చూడటానికి చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. అలాంటి ఓ అద్భుతం నేడు ఆవిష్కృతం కానుంది. నేడు అనగా గురువారం మధ్యాహ్నం.. 12 గంటల 12 నిమిషాలకు భాగ్యనగరంలో అరుదైన అద్భుతం చోటు చేసుకోనుంది. దీన్ని మిస్సైతే.. మళ్లీ ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. కనుక కచ్చితంగా ఈ రోజు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపొండి. ఇంతకు ఏంటా అద్భుతం.. ప్రతి ఏటా అది జరుగుతుందా.. ఎక్కడ చూడాలి అంటే..
మన జీవితంలో ఏవైనా సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నా.. ఎవరైనా మనల్ని వెంబడిస్తున్నా.. నీడలా వెంటాడుతున్నాయి.. వెంటాడుతున్నారు అని చెబుతాం. అంటే అర్థం.. ఏం జరిగినా మన నీడ మనల్ని విడిచిపోదని. మన జీవితంలో నుంచి ఎవరైనా వెళ్లి పోవచ్చు.. కానీ మన నీడ మాత్రం మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. మరి అలాంటి నీడ ఉన్నట్లుండి మాయమైతే.. కనిపించకుండా పోతే.. అది అద్భుతం.. వింతే కదా.
ఈ అద్భుతం నేడు అనగా గురువారం మధ్యహ్నం చోటు చేసుకోనుంది. నేడు సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు హైదరాబాద్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. 12:12 నుంచి 12:14 గంటల పాటు ఈ అద్భుతం కనువింద చేయనుంది. అయితే ఇదేదో మాయో, మంత్రమో కాదు. ఇది సైన్స్. మరి ఇంతకు ఈ అద్భుతం ఎలా చోటు చేసుకుంటుంది అంటే..
నేడు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు ఈ అద్భుతం జరగనుంది. మరి ఇది ఎలా సాధ్యం కానుంది అంటే.. సూర్యుడు సరిగ్గా నడి నెత్తి మీద ఉంటే.. నిటారుగా ఉండే వస్తువు, మనిషి, జంతువు.. ఏ ప్రాణి నీడ కూడా కనిపించదు. దీన్నే జీరో షాడో డే అంటారు. హైదరాబాద్‌లో ఈ జీరో షాడో డే నేడు మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకూ ఉంటుంది. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం జీరో షాడో కనిపించే అవకాశం ఉండదు. ఈ జీరో షాడో ను రెండు, మూడు రోజులపాటు.. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూడొచ్చని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ వెల్లడించారు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. భూభ్రమణం వల్లనే సూర్యుడు తూర్పున ఉదయించి.. పడమర అస్తమిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఈ భ్రమణం వల్ల మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడి నెత్తి మీద నుంచి వెళ్తున్నప్పుడు సూర్య కిరణాలు 90 డిగ్రీల కోణంలో భూమ్మీద నిటారుగా పడతాయి. ఆ సమయంలో నిలువుగా ఉన్న వస్తువు, మనిషి నీడ సరిగ్గా ఆ వస్తువు కిందే పడుతుంది. దీన్నే జీరో షాడో మూమెంట్ అని పిలుస్తారు. ఈ అద్భుతం..ఉత్తరాయణం, దక్షిణాయంలో ఒకకసారి చొప్పున ఏడాదికి రెండు సార్టు ఆవిష్కృతమవుతుంది. దీనిలో భాగంగా నేడు హైదరాబాద్‌లో జీరో షాడో డే కనిపించనుంది.