స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణ ప్రభుత్వం దసరా, బతుకమ్మ సెలవుల్ని ప్రకటించింది. బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు అక్టోబర్‌ 13నుంచి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. సెలవులు 13వ తేదీనుంచి 25వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు ఉండనున్నాయి. 26వ తారీఖునుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సెలవుల రూల్స్‌ను అన్ని పాఠశాలలు తప్పని సరిగా పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక, రాష్ట్రంలోని ఇంటర్‌ మీడియట్‌ మాత్రం 19వ తేదీనుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.

25వ తేదీ వరకు సెలవులు కొనసాగుతాయి. కాగా, ఏపీలో అక్టోబర్‌ 14 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు మొత్తం 11 రోజులు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్‌ 25నుంచి పాఠశాలలు పునఃప్రాంభం కానున్నాయి. ఇక, అక్టోబర్‌ 3నుంచి 6 వరకు ఎఫ్‌ఏ-2 పరీక్షలు జరగనున్నాయి. 6నుంచి 10వ తరగతి వరకు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. మరి, తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకుని 13  రోజులు స్కూళ్లకు సెలవులు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments