CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం! ప్రజల హర్షం

తెలంగణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్భార్ ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం.. మరికొన్ని కిలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

తెలంగణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్భార్ ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం.. మరికొన్ని కిలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

ఈ నెల 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి సంతకం ఆరు గ్యారెంటీలపై చేశారు. గతంలో నిరుద్యోగ దివ్యాంగురాలు(మరుగుజ్జు) రజినీకి ఉద్యోగం ఇవ్వడమే కాదు.. వేదికపై నియామక పత్రాన్ని కూడా అందించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు.. విద్యుత్ శాఖతో చర్యలు, ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చడం ఇలా వరుసగా తన మార్క్ చాటుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో ఎంతోమంది పౌరులు తమ ప్రాణాలు బలిదానం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారిపై సమైక్య రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. అనుకున్నట్లుగా తెలంగాణ సాధించాం.. కానీ యువతపై ఎన్న కొన్ని కేసులు మాత్రం ఇంకా ఎత్తివేకయపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. వివరాలు వచ్చిన వెంటనే ఉద్యమకారులపై నమోదు అయిన కేసులను ఎత్తివేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కొంతకాలంగా కేసులతో ఇబ్బంది పడుతున్న ఉద్యమ కారులకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.

సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు, ప్రగతి భవన్ ని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా భవన్ గా మార్చి.. ప్రజల కష్టాలు స్వయంగా ప్రజా ప్రతినిధులకు చెప్పుకొని అర్జీలు పెట్టుకునే విధంగా ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం లేకుండా సుస్థిర పరిపాలన అందిస్తుందని ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట.. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినందుకు ఉద్యమకారులు, ప్రజలు ఆయనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments