bungalow in Kundanbagh is rumored to be haunted by ghosts: హైదరాబాద్ లో దెయ్యాల బంగ్లా!.. అర్థరాత్రి యువత హల్‌చల్!

హైదరాబాద్ లో దెయ్యాల బంగ్లా!.. అర్థరాత్రి యువత హల్‌చల్!

హైదరాబాద్ మహానగరంలో ఓ బంగ్లాలో దెయ్యాలున్నాయంటూ ఓ వార్త నెట్టింటా వైరల్ గా మారింది. ఆ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో ఓ బంగ్లాలో దెయ్యాలున్నాయంటూ ఓ వార్త నెట్టింటా వైరల్ గా మారింది. ఆ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో ఓ బంగ్లాలో దెయ్యాలున్నాయంటూ ఓ వార్త నెట్టింటా వైరల్ గా మారింది. ఆ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం, ఫేమస్ అయ్యేందుకు దెయ్యాలు ఉన్నాయంటూ పుకార్లకు తెరలేపుతున్నారు. కాగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో ఇంకా దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ ఏంటీ ఈ పిచ్చి పనులు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ కావడంతో ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. దెయ్యాలు తిరుగుతున్నాయంటూ ప్రచారం చేసే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు.

హైదరాబాద్ బేగంపేట్‌ పరిధిలోని కుందన్‌బాగ్‌లోని ఓ బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ పుకార్లు పుట్టిస్తున్నారు కొంతమంది యువత. దెయ్యాలు ఉన్నట్లుగా, అవి వారిని వెంబడిస్తున్నట్లుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆకతాయిలు. అయితే ఆ బంగ్లాలో కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కొంత కాలం తరువాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే వారు మృతి చెంది 6 నెలలు గడిచినట్లు తేలింది. అయితే ఇప్పటివరకు ఈ మరణాలు మిస్టరీగానే ఉన్నాయి. ఈ క్రమంలో అందులో చనిపోయిన వారే దెయ్యాలుగా తిరుగుతున్నారంటూ యువత ప్రచారానికి తెరలేపారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఇలాంటి వీడియోలు తీసి వైరల్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత మూడు రోజుల్లో ఏకంగా 35 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కుందన్‌ బాగ్‌లో దెయ్యాల కొంప అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఈ వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి 35 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని.. కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించామని పంజాగుట్ట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ కుమార్ తెలిపారు.

Show comments