Nidhan
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
క్రికెట్లో ఒక్కో బ్యాట్స్‌మన్ ఆటతీరు ఒక్కో విధంగా ఉంటుంది. అందరూ ఒకేలా ఆడరు. కొందరు ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేస్తారు. మరికొందరు నిదానంగా ఆడతారు. ఇంకొందరు మాత్రం మొదట్లో స్లోగా ఆడినా ఆ తర్వాత అవసరాన్ని బట్టి గేర్లు మార్చి వేగం పెంచుతారు. టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అచ్చం ఇలాగే ఆడతాడు. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్ బిగ్ స్కోర్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అయితే వన్డేలు, టెస్టులకు అతడి గేమ్ సూట్ అయినా టీ20ల్లో మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారింది. కోహ్లీ స్ట్రైక్ రేట్ అంశం ఈ మధ్య చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఈ విషయం మీద అతడు స్పందించిన తీరుకు ఎవ్వరైనా నవ్వుకోవాల్సిందే.
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో ముందంజలో ఉన్నాడు. ఆడిన 10 మ్యాచుల్లో 509 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతడి స్ట్రైక్ రేట్ మాత్రం 146గానే ఉంది. దీంతో అందరూ విరాట్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత నెమ్మదిగా ఆడితే వరల్డ్ కప్ కొట్టినట్లేనని.. బ్యాటింగ్ స్టైల్ మార్చుకోమంటూ సూచిస్తున్నారు. ఇది కోహ్లీ చెవుల దాకా వచ్చిందేమో గత కొన్ని మ్యాచుల్లో అతడు వేగంగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ విషయంపై రోహిత్ రియాక్ట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ మీద బీసీసీఐ నిర్వహించిన ప్రెస్మీట్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలసి అటెండ్ అయ్యాడు హిట్‌మ్యాన్. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు అతడు సమాధానం చెప్పాడు.
అన్ని క్వశ్చన్స్కు ఎంతో ఓపిగ్గా ఆన్సర్ ఇచ్చిన రోహిత్.. కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి జర్నలిస్టులు అడగ్గానే గట్టిగా నవ్వాడు. హిట్‌మ్యాన్‌తో పాటు పక్కనే ఉన్న అగార్కర్ కూడా నవ్వాపుకోలేకపోయాడు. నవ్వును కంట్రోల్ చేసుకున్న అగార్కర్.. విరాట్ స్ట్రైక్ రేట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. దీని గురించి చర్చలు అనవసరమన్నాడు. ఐపీఎల్లో కింగ్ అదరగొడుతున్నాడని.. కాబట్టి స్ట్రైక్ రేట్ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. సెకండ్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బదులు సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి గల కారణాన్ని కూడా అగార్కర్ రివీల్ చేశాడు. కేఎల్ టాపార్డర్ బ్యాటర్ అని.. అదే సంజూ అయితే మిడిలార్డర్లోనూ పరుగులు చేయగలడని, అందుకే అతడ్ని టీమ్‌లోకి తీసుకున్నామని పేర్కొన్నాడు.
Rohit Sharma and Ajit Agarkar started smiling when the Journalist asked about the Strike Rate of Virat Kohli. 😄👌 pic.twitter.com/NQMHYc8WmE
— Johns. (@CricCrazyJohns) May 2, 2024