Rohit Sharma: కెప్టెన్‌గా ధోనికి కూడా సాధ్యం కాని రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ!

Rohit Sharma: కెప్టెన్‌గా ధోనికి కూడా సాధ్యం కాని రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ!

కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనికి కూడా సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆఫ్గానిస్తాన్ తో తాజాగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు హిట్ మ్యాన్.

కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనికి కూడా సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆఫ్గానిస్తాన్ తో తాజాగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు హిట్ మ్యాన్.

రోహిత్ శర్మ.. 14 నెలల తర్వాత టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఎంట్రీ ఇచ్చిన తొలి రెండు మ్యాచ్ ల్లో వరుసగా డకౌట్లే. దీంతో రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక ఫ్యాన్స్ నిరాశను ఒకే ఒక్క మ్యాచ్ లో తీర్చిపడేశాడు హిట్ మ్యాన్. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు టీమిండియా కెప్టెన్. పొట్టి ఫార్మాట్ లో తన ఆకాలి మెుత్తం ఈ మ్యాచ్ లో తీర్చేసుకున్నాడు. 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక రెండు సూపర్ ఓవర్లలో కూడా 13, 11 రన్స్ కొట్టాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ గా భారత మాజీ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనికి సైతం సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్గానిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనతలు సాధించి.. చరిత్రకెక్కాడు హిట్ మ్యాన్. తాజాగా జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత మాజీ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి సైతం ఈ రికార్డు సాధ్యంకాలేదు. ఇలాంటి ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న కెప్టెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు రోహిత్. అతడు తాజాగా గెలుచుకున్న అవార్డుతో కలిపి 6 ప్లేయర్ ఆఫ్ ది అవార్డులు సాధించాడు. 55 మ్యాచ్ ల్లో రోహిత్ ఈ రికార్డు సృష్టించాడు. దీంతో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డులు గెలుచుకున్న ఇండియన్ కెప్టెన్ గా చరిత్ర నెలకొల్పాడు రోహిత్. ఇదే కాకుండా గత మ్యాచ్ ల్లో 100 టీ20 విజయాలు అందించిన కెప్టెన్ గా, 150 ఇంటర్నేషన్ టీ20 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా పలు రికార్డులను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు ఈ ఇండియన్ కెప్టెన్. మరి రోహిత్ ఇలా వరుసగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments