Rohit Sharma: వీడియో: వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌కు తెలుగు అభిమానుల అదిరే గిఫ్ట్‌!

Rohit Sharma, Vizag, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సాధించిన సంతోషంలో తెలుగు క్రికెట్‌ అభిమానులు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. వారి అభిమానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Vizag, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సాధించిన సంతోషంలో తెలుగు క్రికెట్‌ అభిమానులు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. వారి అభిమానం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఒక్కసారిగా భారతదేశం గర్వంతో ఉప్పొంగింది. వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల కల నిజమైన వేళ ఎన్నో కళ్లు ఆనందభాష్పాలతో తడిశాయి.. ఎన్నో ముఖాలపై చిరునవ్వులు విరిశాయి.. చాలా మంది మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఏ విషయంలోనే కాస్త భిన్నంగా ఉన్నంతంగా ఉండే తెలుగువాళ్లు.. ఇప్పుడు టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సందర్భంగా చేసుకునే సంబురాల విషయంలో కూడా వినూత్నంగానే ఆలోచించారు.

దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్‌కు రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై తమ అభిమానం చాటుకుంటూ.. ఏకంగా ఊడు అంతస్థుల పోస్టర్‌ను రోహిత్‌ శర్మ కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రోహిత్‌ శర్మకు దక్కుతున్న ఈ అభిమానం చూసి.. దేశవ్యాప్తంగా ఉండే రోహిత్‌ శర్మ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా.. తెలుగు వాళ్ల అభిమానం వేరే అంటూ ప్రశంసలు గురిపిస్తున్నారు.

ఇంతకీ ఈ భారీ పోస్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. మూడు అంతస్థుల బిల్డింగ్‌ పై నుంచి మెల్లగా పోస్టర్‌ను మెల్లగా కిందికి వదులుతున్న సీన్‌.. సినిమాటిక్‌గా ఉంది. పోస్టర్‌ రివీల్‌ అవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో అలరించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై రోహిత్‌ ఆడిన 92 పరుగుల ఇన్నింగ్స్‌ అయితే టోర్నీకే హైలెట్‌గా నిలిచింది. కాగా, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత.. రోహిత్‌ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మరి రోహిత్‌ భారీ పోస్టర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి

Show comments