రోహిత్‌ శర్మ నుంచి నేను నేర్చుకుంది ఇదే! ఆ విషయంలో గొప్పోడు: పంత్‌

Rishabh Pant, Rohit Sharma: టీమిండియా యువ క్రికెటర్‌, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ పంత్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant, Rohit Sharma: టీమిండియా యువ క్రికెటర్‌, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ పంత్‌ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అలాగే స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరు మంచి టచ్‌లో ఉండటంతో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌లో టీ20 వరల్డ్‌ కప్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిషభ్‌ పంత్‌.. రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 అఫీషియల్‌ బ్రాండ్‌ కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌లో మాట్లాడిన పంత్‌.. ఒక కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఎలా ఉంటాడు? అతని నుంచి తాను నేర్చుకున్న విషయాలేంటి? అనే అంశాలపై స్పందించాడు. ఈ క్రమంలోనే ఆ విషయంలో రోహిత్‌ శర్మ గొప్పోడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతకీ ఏ విషయంలో రోహిత్‌ గొప్పోడని పంత్‌ చెప్పాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మతో ఇన్నోవేటివ్‌ ఐడియాలో, కొత్త ప్రయోగాల గురించి చర్చించే అవకాశం ఉంటుందని, వేరే ఆటగాళ్లు థాట్‌ ప్రాసెస్‌ను రోహిత్‌ అన్న అర్థం చేసుకుంటాడని పంత్ పేర్కొన్నాడు. ముందు అవతలి ప్లేయర్‌ ఏం ఆలోచిస్తున్నాడు అనే విషయాన్ని రోహిత్‌ శర్మ ముందుగా తెలుసుకుంటాడు. తర్వాత.. అది చేయాలా వద్దా అని డిసైడ్‌ అవుతాడు. అసలైతే ముందు అవతి వ్యక్తి చెప్పేది పూర్తిగా వింటాడు. అది రోహిత్‌ అన్నలో ఉంటే చాలా గొప్ప విషయమని పంత్‌ వెల్లడించాడు. ట్రాస్ట్‌ ఫ్యాక్టర్‌.. ఇతర ప్లేయర్లను నమ్మడం అనేది రోహిత్‌ శర్మ నుంచి నేర్చుకున్నాను అని రిషభ్‌ పేర్కొన్నాడు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో వికెట్‌ కీపర్‌గా పంత్‌ టీమిండియాకు అలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఎంతో హెల్ప్‌ అవ్వనున్నాడు.

ఇక పోతే.. ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ లోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ సూపర్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ముంబై ఇండియన్స్‌ 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌ 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఈ మ్యాచ్‌కి ముందు రోహిత్‌ శర్మ గురించి పంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments