SRH కాదు.. అసలైన విధ్వంసం RCBదే! IPL చరిత్రలోనే భారీ రికార్డ్‌!

RCB. GT vs RCB, IPL 2024; ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

RCB. GT vs RCB, IPL 2024; ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో వారం రోజుల క్రితం వరకు చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ఆర్సీబీ.. తిరిగి ట్రాక్‌ ఎక్కినట్లు కనిపిస్తోంది. తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంటూ.. ఆదివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ.. గుజరాత్‌ టైటాన్స్‌ 200 పరుగుల భారీ స్కోర్‌ చేసినా కూడా.. ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊదిపారేసింది. ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌ అయిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ 12 బంతుల్లో 24 పరుగులు చేసి, వేగంగా ఆడే క్రమంలో త్వరగానే అవుటైనా.. మరో వికెట్‌ పడకుండా.. విరాట్‌ కోహ్లీ, విల్‌ జాక్స్‌ జోడీ గుజరాత్‌ బౌలర్లను ఊచకోత కోసి.. ఈ సీజన్‌లో ఆర్సీబీకి మూడో విజయాన్ని అందించింది. అయితే.. గుజరాత్‌పై భారీ విజయంతో పాటు.. ఆర్సీబీ మరో అతి భారీ రికార్డును కూడా కొల్లగొట్టింది. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుత సీజన్‌లో భారీ భారీ స్కోర్లు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి జట్టు 200 స్కోర్‌ చేయడం అనేది కామన్‌గా మారిపోయింది. పైగా 262 పరుగుల టార్గెట్‌ కూడా సేఫ్‌ కాదని, ఇటీవల కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ నిరూపించింది. అయితే.. 200 పరుగులకే పైగా ఛేజ్‌ చేస్తూ.. అత్యంత వేగంగా ఆ ఛేజ్‌ను ముగించిన టీమ్‌గా ఆర్సీబీ కొత్త చరిత్ర లఖించింది. గతంలో ముంబై ఇండియన్స్‌ పేరిట ఉన్న ఆ రికార్డును బద్దలు కొడుతూ.. ఆర్సీబీ టాప్‌ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది. గత సీజన్‌లో అంటే 2023 ఐపీఎల్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 200 ప్లస్‌ టార్గెట్‌ను ముంబై ఇండియన్స్‌ 16.3 ఓవర్లలో ఛేదించింది. ఇప్పుడా రికార్డును బ్రేక్‌ చేస్తూ.. గుజరాత్‌పై 200 ప్లస్‌ టార్గెట్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కేవలం 16 ఓవర్లలోనే ఛేజ్‌ చేసి.. నయా రికార్డును నెలకొల్పింది. గుజరాత్‌పై విజయంతో పాటు ఈ భారీ రికార్డును కూడా ఆర్సీబీ తమ ఖాతాలో వేసుకుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది. జీటీ బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 49 బంతుల్లో 84, షారుఖ్‌ ఖాన్‌ 30 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించారు. ఓపెనర్లు సాహా 5, శుబ్‌మన్‌ గిల్‌ 16 పరుగులు మాత్రమే చేసి విఫలం అయ్యారు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ 19 బంతుల్లో 26 రన్స్‌ చేసిన పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇక 201 టార్గెట్‌తో బరిలోకి దిగన ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి.. 206 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్‌ 12 బంతుల్లో 24 రన్స్‌ చేసి తర్వగా అవుటైనా విరాట్‌ కోహ్లీ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు చేసి మరోసారి తన ఛేజ్‌ మాస్టర్‌ బిరుదుకు న్యాయం చేశాడు. ఇక విల్‌ జాక్స్‌ అయితే కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకుని.. విధ్వంసం సృష్టించాడు. మరి ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments