Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాస్ డాన్స్‌తో ఇరగదీశాడు. అతడి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాస్ డాన్స్‌తో ఇరగదీశాడు. అతడి డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Nidhan
రంజీ ట్రోఫీ-2024ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. మ్యాచ్ రెండో రోజు నుంచి పట్టుబిగిస్తూ వచ్చిన రహానె సేన.. ఐదో రోజు వరకు దాన్ని నిలబెట్టుకొని బంపర్ విక్టరీ కొట్టింది. ఫైనల్లో విదర్భను ఏకంగా 169 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సంతోషంలో ఉన్న విదర్భ భారీ స్కోరు చేసి మ్యాచ్‌ను గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని అనుకుంది. కానీ ముంబై బౌలర్లు చెలరేగడంతో ఆ టీమ్ 105 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులు చేసి 538 పరుగుల భారీ టార్గెట్‌ను విదర్భ ముందు ఉంచింది. కానీ ఆ జట్టు 368 పరుగులు మాత్రమే చేసి ట్రోఫీని చేజార్చుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ డాన్స్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
రికార్డు స్థాయిలో ముంబై 42వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకోవడంతో ఆ జట్టు సభ్యులంతా సంబురాల్లో మునిగిపోయారు. గ్రౌండ్లో వందలాదిగా ఉన్న ముంబై అభిమానులు కూడా తమ జట్టు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబై.. ముంబై అంటూ గట్టిగా అరుస్తూ, ఈలలు వేస్తూ సందడి చేశారు. ఆ టైమ్‌లో ఫుల్ జోష్‌లో ఉన్న ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టేడియంలో ఫ్యాన్స్ డ్రమ్స్ వాయిస్తుండటంతో దానికి తగ్గట్లు తన కాళ్లను కదిపాడు. చేతులతో గెలిచామంటూ చూపిస్తూ మాస్ డాన్స్‌తో ఇరగదీశాడు. అయ్యర్‌కు తోడుగా మరికొందరు ముంబై ఆటగాళ్లు కూడా డాన్స్ చేయడంతో స్టేడియం అంతా ముంబై.. ముంబై అనే నినాదాలతో హోరెత్తింది.
అయ్యర్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు ఆటతో పాటు డాన్స్‌తో మా హృదయాలు గెలుచుకున్నావ్ బాస్ అని కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ డాన్స్ అయ్యర్.. ఐపీఎల్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులు అంటున్నారు. క్యాష్ రిచ్ లీగ్‌ల్ అతడు కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక, విదర్భతో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు చేసి ఫెయిలైన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టాడు. 95 పరుగుల సూపర్బ్ నాక్‌తో ముంబై భారీ స్కోరుకు అతడు బాటలు వేశాడు. ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేస్తే అయ్యర్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెప్పాలి. మరి.. శ్రేయస్ మాస్ డాన్స్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాండ్యా కెప్టెన్సీలో ఆడటం రోహిత్‌కు ఇష్టం లేదా? పోస్ట్ డిలీట్ దేనికి?
Shreyas Iyer dancing and celebrating Mumbai’s Ranji Trophy win. pic.twitter.com/nsfaHuZuhk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2024