Ben Foakes: వీడియో: ఇంగ్లాండ్ కీపర్ వింత కీపింగ్! గ్రౌండ్ అంతా నవ్వులు! 

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వింతైన కీపింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వింతైన కీపింగ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో గురువారం(జనవరి 25)న ప్రారంభం అయిన తొలి టెస్ట్, తొలిరోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. బజ్ బాల్ ఆటకు పెట్టింది పేరైన ఇంగ్లాండ్ ఆటగాళ్లను చాపలా చుట్టేశారు టీమిండియా స్పిన్నర్లు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగుల తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యింది ఇంగ్లీష్ టీమ్. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ కు దిగిన తర్వాత ఓ ఫన్నీ మూమెంట్ చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేసిన పనికి స్టేడియం మెుత్తం పగలబడి నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరుతుంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఇందుకు కారకులు ప్రేక్షకులు అయితే.. ఎక్కువసార్లు మాత్రం ఆటగాళ్లే అవుతుంటారు. తాజాగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా ఓ నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా బౌలర్ల దెబ్బకి బజ్ బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లాండ్ టీమ్ 246 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ స్పిన్ తో ఇంగ్లీష్ ప్లేయర్లను బోల్తాకొట్టించారు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించింది ఇండియా. ఈ క్రమంలోనే టెస్ట్ అరంగేట్రం చేసిన స్పిన్నర్ టామ్ హార్ట్లీ బౌలింగ్ లో తొలి బంతినే సిక్సర్ గా మిలిచాడు యువ సంచలనం యశస్వీ జైస్వాల్.
ఇక మూడో ఓవర్ వేయడానికి వచ్చాడు మార్క్ వుడ్. ఇక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాల్ ను ఓలీ పోప్ వైప్ కొట్టాడు. ఈ బంతికి సింగిల్ రాగా.. పోప్ బంతిని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వైప్ బలంగా విసిరాడు. ఇక ఆ బాల్ నే చూసుకుంటూ పరిగెత్తుకువచ్చిన ఫోక్స్ అమంతాం మూడు వికెట్లపై పడ్డాడు. దాంతో అతడి కాలు తగిలి మూడు వికెట్లు కాస్త మూరెడు దూరాన పడ్డాయి. ఇక ఈ దృశ్యం చూసి అటు కామెంట్రీ బాక్స్ తో సహా..స్టేడియం మెుత్తం నవ్వులు పూశాయి. కీపర్ సైతం అంపైర్ తో నవ్వుతూ వికెట్లను పాతడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి వింత కీపింగ్ బ్రో.. మేము ఇంతవరకు చూడలేదని కొందరు అంటే.. చూసుకోవాలి కదా బ్రో.. కొద్దిగైతే ఎక్కడో గుచ్చుకునేవి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Show comments