Somesekhar
రుతురాజ్ గైక్వాడ్ కు సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేకు ముందు ఊహించని షాక్ తగిలింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రుతురాజ్ గైక్వాడ్ కు సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేకు ముందు ఊహించని షాక్ తగిలింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Somesekhar
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసుకున్నాయి ఇరు జట్లు. ఇక తాజాగా ప్రారంభమైన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ ను 8 వికెట్ల తేడాతో నెగ్గింది టీమిండియా జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించడంతో.. సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది ప్రోటీస్ జట్టు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు బిగ్ షాక్ తగిలింది.
సాధారణంగా క్రికెటర్లు పర్యటనలో భాగంగా ఒక వేదిక నుంచి మరో వేదికకు ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరి ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులు ఉంటాయన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ప్లేయర్లు బస్సులో జర్నీ చేసేటప్పుడు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ సంఘటనే టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు ఎదురైంది. అసలు విషయం ఏంటంటే? సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయర్లు అంతా బస్సులో బయటుదేరటానికి సిద్దంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే చివరిగా భారత ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ బస్సు ఎక్కుదామని అక్కడికి వచ్చాడు. ఇక ఇదే టైమ్ కు బస్సు డ్రైవర్ బస్ డోర్ ను క్లోజ్ చేశాడు. దీంతో రుతురాజ్ ఒక్కసారిగా షాకైయ్యాడు. ఇది చూసిన బస్సు డ్రైవర్ రుతురాజ్ కు ఏదో సైగచేశాడు. ఊహించని పరిణామంతో.. గైక్వాడ్ అయోమయానికి లోనైయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తొలి వన్డేలో రుతురాజ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక సెకండ్ వన్డే డిసెంబర్ 19 మంగళవారం నాడు సెయింట్ జార్జ్ పార్క్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి.. సిరీస్ ను చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది టీమిండియా.
Bus Driver after Ruturaj Gaikwad scores 5(10).pic.twitter.com/fplUBMOEdc
— Arun Singh (@ArunTuThikHoGya) December 17, 2023