సెంచరీతో దుమ్మురేపిన RCB కెప్టెన్‌ డుప్లెసిస్‌! ఫోర్లు, సిక్సులతో విధ్వంసం​..

Faf du Plessis, MLC 2024, Washington Freedom, Texas Super Kings: ఫాఫ్‌ డుప్లెసిస్‌ తన విశ్వరూపం చూపిస్తూ.. సూపర్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కానీ, ఆర్సీబీ అభిమానులు అతన్ని తిడుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Faf du Plessis, MLC 2024, Washington Freedom, Texas Super Kings: ఫాఫ్‌ డుప్లెసిస్‌ తన విశ్వరూపం చూపిస్తూ.. సూపర్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కానీ, ఆర్సీబీ అభిమానులు అతన్ని తిడుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో ఆడుతున్న డుప్లెసిస్‌ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ.. బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా.. సోమవారం వాషింగ్టన్ ఫ్రీడమ్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌కు డుప్లెసిస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌.. మన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓనర్స్‌దే అనే విషయం తెలిసిందే. సోమవారం వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్‌ తన విశ్వరూపం చూపించాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీఎస్‌కేకు అద్భుతమైన ఆరంభం అందిస్తూ.. కేవలం 58 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సులతో 100 పరుగులు సాధించాడు. అతనికి తోడు మరో ఓపెనర్‌ డెవాన్ కాన్వె సైతం 39 పరుగులతో రాణించాడు. డుప్లెసిస్‌ దెబ్బకి టీఎస్‌కే భారీ స్కోర్‌ సాధించింది. డుప్లెసిస్‌, కాన్వె మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా.. 203 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే.. డుప్లెసిస్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ చూసిన ఆర్సీబీ అభిమానులు.. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఐపీఎల్‌లో ఏమైందంటూ మండిపడుతున్నారు. ఐపీఎల్‌ 2024లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో ఆర్సీబీ బ్యాటింగ్‌ భారాన్ని తన భుజాలపై మోస్తే.. డుప్లెసిస్‌ అడపాదడపా మాత్రమే ఆడాడు. కానీ, ఎంఎల్‌సీలో మాత్రం అదరగొడుతున్నాడు. ఇదే ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 100, డెవాన్‌ కాన్వె 39, స్టోయినీస్‌ 29 పరుగులు చేశారు. వాషింగ్టన్‌ బౌలర్లలో నేత్రవాల్కర్‌ 2 వికెట్లతో రాణించాడు. మార్కో జాన్సెన్‌, అకిల్‌ హుస్సేన్‌, జే డిల్లీ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్టుకు ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, స్టీవ్‌ స్మిత్‌ అదిరిపోయే ఆరంభం అందించారు. 4 ఓవర్లలో 62 పరుగులు చేశారు. హెడ్‌ 12 బంతుల్లో 32, స్మిత్‌ 13 బంతుల్లో 26 పరుగులు చేసి అదరగొడుతున్న టైమ్‌లో వర్షం రావడంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే రద్దు అయింది. వాషింగ్టన్‌ టీమ్‌ కనీసం 5 ఓవర్లు కూడా ఆడకపోవడంతో డక్‌ వర్త్‌ లూయిస్‌ ద్వారా ఫలితం తేల్చడం కుదరలేదు. మరి ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ సెంచరీతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments