SNP
Barinder Sran Retirement: టీమిండియా తరఫున తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన ఓ పేస్ బౌలర్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
Barinder Sran Retirement: టీమిండియా తరఫున తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన ఓ పేస్ బౌలర్.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు.. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
SNP
మహేంద్ర సింగ్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్న ఓ వెటరన్ క్రికెటర్.. తాజాగా అంతర్జాతీయి క్రికెట్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బరిందర్ స్రాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి చేశాడు. తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియాను వణికించాడు. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను అవుట్ చేసి.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
టీమిండియా తరఫున మొత్తం 6 వన్డేలు, 2 టీ20లు ఆడాడు బరిందర్ స్రాన్. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో అన్ని రకాల ఫార్మాట్లకు, దేశవాళి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తను ఆడిన 6 వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే రెండు టీ20ల్లో 6 వికెట్లు సాధించాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత టీమ్‌లో ప్లేస్‌ను పర్మినెంట్ చేసుకోలేకపోయాడు.
2016 జూన్ 22న జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్.. బరిందర్ కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఐపీఎల్‌లో కూడా స్రాన్ మంచి ప్రదర్శనలు చేశాడు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున మొత్తం 24 మ్యాచ్‌లు ఆడిన 18 వికెట్లు సాధించాడు. ఇక ఫస్ట్ క్లాస్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్ ఏ 31 మ్యాచ్‌ల్లో 45, దేశవాళి టీ20ల్లో 48 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు సాధించాడు. స్రాన్ టీమిండియాలోకి వచ్చే సమయానికి అతనికి పెద్దగా డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. కానీ, ఆరంభంలోనే సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టడంతో టీమిండియాలో చాలా త్వరగా స్థానం సంపాదించాడు. కానీ, ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. మరి బరిందర్ స్రాన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.