Former CBI JD Lakshmi Narayana announced new Political party: AP రాజకీయాల్లో సంచలనం.. కొత్త పార్టీ ప్రకటించిన CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ

AP రాజకీయాల్లో సంచలనం.. కొత్త పార్టీ ప్రకటించిన CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ కొత్త పార్టీ సంచలనాన్ని సృష్టిస్తోది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ కొత్త పార్టీ సంచలనాన్ని సృష్టిస్తోది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా ఇప్పుడు మరో రాజకీయ పార్టీ ఏపీలో సంచలనాన్ని రేపింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కొద్దికాలం నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఏపీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. జై భారత్‌ నేషనల్‌ పేరిట కొత్త పొలిటికల్ పార్టీని పెట్టారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచే ఎన్నికల బరిలో దిగనున్నారు. ఏపీ రాజకీయాల్లో జై భారత్‌ నేషనల్‌ పార్టీ సంచలనంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఆయా పార్టీలకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని వెల్లడించారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయా రాజకీయ పార్టీల వారు విఫలమయ్యారని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జై భారత్‌ నేషనల్‌ పార్టీ కృషి చేస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నామని, మా పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యఅని.. ప్రత్యేక హోదా సాధిస్తే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తదని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Show comments