OTT Thriller Movie: OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

OTT Telugu Thriller Movie: కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. ఎప్పుడో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు.. ఒక్కోటిగా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా మరొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి రానుంది.

OTT Telugu Thriller Movie: కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. ఎప్పుడో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు.. ఒక్కోటిగా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా మరొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి రానుంది.

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను బట్టి.. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. కానీ, ఒకప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు మాత్రమే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేవి. ఇక థియేటర్ లో ఆ సినిమాలు హిట్ కాకపోతే ఓటీటీ లో ఆ సినిమాల గురించి అంతగా టాక్ వినిపించేది కాదు. కానీ ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తుంది. థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఊహించని రేంజ్ లో ఓటీటీ లో హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడో థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలను ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు “ప్లాట్”. ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో థియేటర్ లో రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ.. ఎందుకో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ విషయంలో కూడా అంతగా రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్లాట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ జులై 11 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. వికాస్ , గాయత్రీ హీరో హీరోయిన్స్ గా నటించారు. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ప్లాట్ మూవీ కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో హీరో రాహుల్ ఓ వ్యాపారంలో దెబ్బతిని ఉంటాడు. ఇక అతని గర్ల్ ఫ్రెండ్ దీపు డ్రగ్ డీలర్ గా బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. దీనితో అతను దీపుని వెతుకుంటుంటాడు. అయితే ఇక రాహుల్ తన ఇంటిని అమ్మేసి.. దీపుతో కలిసి విదేశాలకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి తమ్ముడు వాళ్ళని కనిపెడతాడు. అప్పుడు రాహుల్ , దీపు ఇద్దరు అతనిని కూడా చంపేసి.. వాళ్ళు అమ్మాలనుకునే స్థలంలో పాతేస్తారు. అప్పటినుంచి రాహుల్ కు తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో.. మంచి లాభాలు వస్తాయి. అలాగే అతనికి శత్రువులు కూడా పెరుగుతారు. అతనిని ఓ వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ అడ్డుపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు ? అతనికి రాహుల్ కు గతంలో ఏదైనా సంబంధం ఉందా ? వారు చేసిన హత్యల గురించి పోలీసులకు తెలుస్తుందా ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments