Gold&Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. త్వరపడండి.. ఇదే మంచి ఛాన్స్‌!

Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా.. త్వరపడండి.. ఇదే మంచి ఛాన్స్‌!

బంగారం కొనాలి.. కానీ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. కొన్ని రోజుల పాటు పసిడి రేటు పెరుగుతుండగా.. మరి కొన్ని రోజులు వరుస పెట్టి దిగి వస్తుంది. దాంతో బంగారం కొనాలనుకునేవారు.. అయోమయంలో ఉన్నారు. ఇక ఈ నెల ఆరంభం నుంచి బంగారం ధర దిగి వస్తూనే ఉంది. క్రితం సెషన్‌లో మాత్రమే బంగారం ధర స్వల్పంగా అనగా 10 గ్రాముల మీద వంద రూపాయలు పెరిగింది. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. దాంతో పసిడి కొనాలనుకునేవారు.. వెంటనే త్వరపడితేనే మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. భవిష్యత్తులో పసిడి రేటు ఎలా ఉంటుందో చెప్పలేం. తర్వాత శుభాకార్యల సీజన్‌ మొదలయితే.. పసిడికి గిరాకీ పెరుగుతుంది. దాంతో ధర పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడే బంగారం కొంటే మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే…

క్రితం సెషన్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగ్గా.. నేడు మాత్రం హైదరాబాద్‌లో పసిడి రేటు స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో.. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.54,150 వద్ద స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల ధర రూ. 59,060 వద్ద ట్రేడవుతోంది.ఘిక నేడు దేశరాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ పసిడి రేట్లు నిలకడగానే ఉన్నాయి. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ రేటు రూ.54,300 వద్ద స్థిరంగా ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల ధర రూ.59,220 వద్ద స్థిరంగా ఉంది.

బంగారం ధర నేడు స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్ర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు వెండి ధర కిలో మీద రూ.500 పెరగ్గా.. ప్రస్తుతం రూ. 72,200 వద్ద ఉంది. అంతకుముందు రోజు మాత్రం ఢిల్లీలో వెండి ధర కిలో మీదర రూ.200 తగ్గింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం వెండి ధర స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో కేజీ సిల్వర్ రేటు రూ.75,800 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1916 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 23.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Show comments