iDreamPost
iDreamPost
జనం థియేటర్లో సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. మినిమమ్ కంటెంట్ ఉంటే చాలు మూడు నెలల ఎడబాటుని తీర్చుకోవడం కోసం వెండితెర వినోదాన్ని అందుకునేందుకు ఎంతగా వేచి చూస్తున్నారో మొన్న శుక్రవారం విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం వసూళ్లు ఋజువుగా నిలుస్తున్నాయి. నిజానికి దీనికి రివ్యూస్ గొప్పగా రాలేదు. పబ్లిక్ లోనూ ఎక్స్ ట్రాడినరి అనే మాటా వినిపించలేదు. నిరాశపరచకుండా టైం పాస్ చేయించి ఎమోషనల్ గా వర్కౌట్ చేశారనే ఫీడ్ బ్యాక్ గట్టిగా వచ్చింది. ఈ చిన్న సినిమాకు ఈ మాట చాలా పెద్ద స్థాయిలో పని చేసింది. దానికి సాక్ష్యంగా కలెక్షన్లు కనపడుతున్నాయి.
ట్రేడ్ నుంచి అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్ కల్యాణ మండపం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ అందుకున్నట్టు తెలిసింది. సుమారు 4 కోట్ల 70 లక్షల దాకా ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ మూవీ వీకెండ్ పూర్తవ్వగానే దానికి చాలా దగ్గరగా వెళ్లిపోయింది. ఇవాళ్టి నుంచి వచ్చేవన్నీ లాభాలే. యూనిట్ ఈ రోజు నుంచి సక్సెస్ టూర్ కూడా మొదలుపెట్టింది. 13 దాకా ప్రేక్షకులకు ఇదొక్కటే బెస్ట్ ఆప్షన్ కాబట్టి టికెట్లు తెగడం తగ్గకుండా ప్రమోషన్ వేగాన్ని పెంచబోతున్నారు. ఈ స్థాయి విజయం తాము కూడా ఊహించలేదని యూనిట్ సభ్యులు కూడా చెబుతున్నారు. ఇక ఏరియాల వారిగా మూడు రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – 1 కోటి 70 లక్షలు
సీడెడ్ – 83 లక్షలు
ఉత్తరాంధ్ర – 45 లక్షలు
ఈస్ట్ గోదావరి – 25 లక్షలు
వెస్ట్ గోదావరి – 19 లక్షలు
గుంటూరు – 35 లక్షలు
కృష్ణా – 18 లక్షలు
నెల్లూరు – 10 లక్షలు
ఏపి/తెలంగాణ మూడు రోజుల షేర్ – 4 కోట్ల 5 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా – 14 లక్షలు
ఓవర్సీస్ – 16 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ – 4 కోట్ల 35 లక్షలు
ఈ ఏడాది సెకండ్ లాక్ డౌన్ తర్వాత నమోదైన మొదటి సూపర్ హిట్ గా ఎస్ఆర్ కళ్యాణ మండపం నిలవబోతోంది. అనూహ్యంగా దీనికన్నా బెటర్ టాక్ వచ్చిన తిమ్మరుసు ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోకపోవడం గమనార్హం. ఇష్క్ రెండో రోజే చతికిలబడింది. ఎస్ఆర్ తో పాటు రిలీజైన ఇతర సినిమాలు కనీసం థియేటర్ రెంటు కట్టేంత కలెక్షన్ కూడా రాబట్టలేక వెనక్కు తగ్గాయి. సో ఇంకో నాలుగు రోజులు ఈ సినిమాకు ఎంత వస్తే అంత మైలేజ్ దక్కుతుంది. ఇలాంటి రెస్పాన్స్ ఊహించని ఇతర నిర్మాతలు ఇప్పుడు పోటీ పడి మరీ డేట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఓటిటికి వెళ్ళాలనుకున్న సీటిమార్ లాంటివి సైతం ఇప్పుడు మనసు మార్చుకున్నాయట
Also Read : ఆ రెండు రోజుల్లో సినిమాల దాడి