తెలంగాణలో ఆరోజు నుంచి భారీ వర్షాలు.. IMD హెచ్చరిక, ఎల్లో అలర్ట్ కూడా జారీ

ఈ మధ్య కాలంలో నగరంలోని పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో.. ప్రజలు  ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ఉక్కపోత, వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వాసులకు ఐఎండీ ఓ చల్లటి వార్త చెప్పింది.

ఈ మధ్య కాలంలో నగరంలోని పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో.. ప్రజలు  ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ఉక్కపోత, వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వాసులకు ఐఎండీ ఓ చల్లటి వార్త చెప్పింది.

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. పైగా గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు భగ భగ మంటున్నాడు. ఇక ఎక్కడ చూసిన నిప్పుల కక్కుతున్నట్లుగా ఎండలు బెంబెలెత్తిస్తుండటంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావలంటేనే జడుస్తున్నారు. ఇక ఎండవేడిమి, ఉక్కపోత, వడ గాలులా వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో నగరవాసులకు ఐఎండీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ చల్లటి వార్తతో పట్టణ ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్య కాలంలో నగరంలోని పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడటంతో.. ప్రజలు  ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన ఉక్కపోత, వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వాసులకు ఐఎండీ ఓ చల్లటి వార్త చెప్పింది. ఇక రానున్న 5 రోజుల్లో తెలంగాణలోని  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక శుక్రవారం కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే శనివారం కూడా ల్గొండ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇకపోతే ఆ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే మరోవైపు జూన్ రెండో తేదీన పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ  ముందుగానే హెచ్చరించింది. అయితే ఈ వర్షాలు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో భారీగా కురిస్తాయని అంచనా వేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రెండు, మూడు రోజుల్లో ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. అలాగే వారం, పదిరోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఎండలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి, తెలంగాణలో వర్షలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments