Venkateswarlu
Venkateswarlu
అదృష్టం ఎవరిని? ఎప్పుడు? ఎలా? వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అదృష్టం మన జీవితాల్లోకి వచ్చినపుడు మాత్రం ఆశ్చర్యంతో పాటు సంతోషంగా కలక్కమానదు. ప్రస్తుతం ఓ బ్యాంకు ఖాతాదారులు అనుకోని అదృష్టం కారణంగా ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. వారి అకౌంట్లోకి ఊహించని విధంగా వేల రూపాయలు వచ్చిపడ్డంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్లో పడ్డ డబ్బుల్ని డ్రా చేసుకుని, అవసరాల కోసం వాడేసుకున్నారు కూడా. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపరా జిల్లా, బటిపాడ వద్ద ఒడిశా కళింగ గ్రామ్య బ్యాంకు ఉంది. సెప్టెంబర్ 11న ఈ బ్యాంకులోని వందలాది మంది ఖాతాదారుల అకౌంట్లలోకి 10 వేల రూపాయలనుంచి 70 వేల రూపాయల వరకు వచ్చి పడ్డాయి. డబ్బులు అకౌంట్‌లో పడ్డ మెసేజ్‌లు వారి ఫోన్లకు వెళ్లటంతో ఆశ్చర్యపోయారు. నిజమో కాదో.. తెలుసుకోవటానికి కుదిరితే డ్రా చేసుకుందామని బ్యాంకు దగ్గరకు క్యూ కట్టారు. డబ్బులు పడ్డం నిజమేనని తేలటంతో విత్ డ్రా చేసుకుని వెళ్లిపోయారు.
అయితే, ఆ డబ్బులు ఎవరు జమ చేశారో బ్యాంకు అధికారులకు కూడా అర్థం కాకుండా ఉంది. కొందరి ఖాతాల్లోకి ఫసల్ భీమా డబ్బులు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. మరికొంతమంది ఖాతాల్లోకి వచ్చిన భారీ మొత్తాలు ఎక్కడివన్న సమాచారం లేదని అన్నారు. ఆ సమాచారం కనుక్కునే పనిలో ఉన్నట్లు తెలిపారు. మరి, ఒడిశా కళింగ గ్రామ్య బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లోకి అనుకోకుండా 60-70 వేల రూపాయలు వచ్చిపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.