Street Beggar English Teacher: భిక్షమెత్తుకొని కడుపు నింపుకునేది.. నేడు ఇంగ్లీష్ టీచర్ గా క్రేజ్

భిక్షమెత్తుకొని కడుపు నింపుకునేది.. నేడు ఇంగ్లీష్ టీచర్ గా క్రేజ్

భిక్షమెత్తుకొని కడుపు నింపుకునేది.. నేడు ఇంగ్లీష్ టీచర్ గా క్రేజ్

విద్యకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికి తెలిసిన విషయమే. అందుకే ఆస్తి ఉన్నవాడి కంటే విద్య  ఉన్నవారికి గౌరవం ఎక్కువ. అయితే ఆ విద్యను అందించే మూల స్తంభాలు  ఉపాధ్యాయులు. వారు పిల్లల్లోని అజ్ఞానాన్ని తొలిగించి.. విజ్ఞాన కాంతులు వెలిగిస్తారు. అలా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు  చేరుకున్నారు. అయితే విద్య నేర్పిన గురువుల్లో చాలా మంది జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఆ కోవాలేనే ఓ టీచర్ కూడా.. అయిన వారిని కోల్పోయి.. రోడ్డుపై భిక్షాటన చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి ఔదార్యం, ఆమె చేసిన ఓ వీడియో.. జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్ గా మంచి క్రేజ్ సంపాదించింది. మరి.. ఆ పంతులమ్మ ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

బర్మాకు చెందిన మెర్లిన్ అనే మహిళ భారతీయ వ్యక్తిని వివాహం చేసుకుని చెన్నైల్లో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, గణితం, తమిళం బోధిస్తూ, భర్తతో కలిసి సంతోషంగా ఉండేది. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఏళ్లు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పొగొట్టుకుంటూ ఒంటరిగా మిగిలి పోయింది. ఎందరికో చదువు చెప్పి..తిన్నడానికి తిండి, ఉండటానికి ఇళ్లు సాధించుకునే స్థాయికి వెళ్లేలా తయారు చేసింది. అలాంటి ఆమెకు తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్ పాత్ పై బతుకుతోంది. చెన్నై రోడ్ల మీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్ట నింపుకుంటోంది.

ఒకరోజు ‘ఏబ్రో కాలేజి కిడ్’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా సమాజ సేవ చేస్తున్న మహమ్మద్ ఆషిక్  కంటపడింది మెర్లిన్ మేడమ్. ఆమెను చూడగానే యాచక వృతికి సంబంధించిన వ్యక్తి కాదని గ్రహించాడు ఆషిక్. ఆమెకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె తన దీనగాథను ఆషిక్ వివరించింది. “నీకు ఏం కావలమ్మా?” అని ఆషిక్ అడగ్గా.. “నా దుస్తువులు చినిగిపోయాయి, వీలైతే అవి కొనివ్వు బాబు” అని చెప్పింది. ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన  ఆషిక్… ఆమెకు ఓ చీర కొనిచ్చాడు. అంతేకాక అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఒక్కో వీడియోలు తీసి.. ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుతో  ఇన్ స్టా ఖాతాల్లో పోస్టు చేస్తున్నాడు. ఆ వీడియోల ద్వారా వచ్చిన సంపాదను ఆమెకు అందించి… ఎవరిపై ఆధార పడకుండా చేశాడు.

ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాక ఆ వీడియోలు.. ఆమె చదువు చెప్పిన పూర్వ విద్యార్థులకు కూడా చేరాయి. అందరూ కలిసి ఆమెకు కష్టం కలగకుండా ఉండేలా వృద్దాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులులేకుండా అన్నివసతలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెర్లిన 80 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ తో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైన ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానకి మెర్లిన్ టీచర్ జీవితమే ఉదాహరణ. మరి.. ఈమె జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments