సినిమా స్టైల్లో మహిళల ఫైట్‌.. రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారు!

సాధారణంగా దురుసు ప్రవర్తన, గొడవలకు దిగే మనస్తత్వం ఎక్కువగా మగాళ్లకు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్టుకోవటం కూడా మగాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్లు తీవ్ర స్థాయిలో కోపానికి గురైతే తప్ప గొడవలకు దిగి తన్నుకోరు. ఒక వేళ అలా జరిగితే.. అది కచ్చితంగా చర్చకు దారి తీస్తుంటుంది. సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఏమైనా ఉంటే అవి వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా, కొంతమంది మహిళలు.. మరో మహిళను రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారు. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఈ విధంగా ఉంది.. ఇద్దరు మహిళలు కలిసి రోడ్డుపై ఓ మహిళను కర్రలతో చుట్టుముట్టారు. ఆమెను కర్రలతో కొట్టడానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా అరవటంతో కొంత వెనక్కు తగ్గారు. దీంతో ఆమె వారినుంచి తప్పించుకుని పరుగులు పెట్టింది. అయినా వాళ్లు ఆమెను వదిలిపెట్టలేదు.

ఆమె రోడ్డుపై పరిగెడుతూ ఉంటే.. కర్రలతో వారు ఆమె వెంట బడ్డారు. సదరు బాధిత మహిళ వేగంగా పరిగెత్తలేకపోయింది. వారికి దొరికిపోయింది. ఆ ఇద్దరు మహిళలు ఆమెను కర్రలతో బాగా కొట్టారు. రోడ్డుపై వెళుతున్న వారు చూస్తూ నిల్చున్నారే తప్ప విడిపించే ప్రయత్నం చేయలేదు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు .. ‘‘ అచ్చం సినిమాలో చూసినట్లుగా ఉంది’’.. ‘‘ ఈ మధ్య కాలంలో మహిళలు కూడా దారుణంగా తయారు అవుతున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన మహిళల ఫైటింగ్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments