Venkateswarlu
Venkateswarlu
ప్రియురాలిని కలవటానికి వచ్చిన ప్రియుడికి గ్రామస్తులు తగిన విధంగా బుద్ది చెప్పారు. అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడికి.. ఆమెతో పెళ్లి చేశారు. ఈ సంఘటన బిహార్లో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బిహార్లోని సివాన్, మహారాణీ గంజ్ ఏరియా.. ముభారక్ పూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మిత్రంజన్ కుమార్.. అకిల్ తోల గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఫోన్లో వీరిద్దరూ ప్రతీరోజూ మాట్లాడుకునే వారు.. చాట్ చేసుకునేవారు.
అయితే, ఫోన్లో మాటలు, చాటింగ్లు వారికి సరిపోయేవి కావు. అందుకే కొన్ని సార్లు ఏకాంతంగా కలుసుకునేవారు. మిత్రంజన్ అప్పుడప్పుడు అర్థరాత్రిళ్లు ప్రియురాలి ఇంటికి వెళ్లే వాడు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా యువతి తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని చాలా మందికి తెలిసిపోయింది. గ్రామస్తులకు తమ విషయం తెలుసన్న సంగతి ఆ ప్రేమికులకు తెలియలేదు. కొద్దిరోజుల క్రితం మిత్రంజన్ తన ప్రియురాలిని కలవటానికి అర్థరాత్రి అకిల్ తోలా గ్రామానికి వెళ్లాడు.
ఇద్దరూ ఓ కలిసి ఉండగా.. గ్రామస్తులు పట్టుకున్నారు. తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని వారు గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు వారికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. ఉదయం మిత్రంజన్ చేత్తో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించారు. దీన్నంతా అక్కడ ఉన్నవాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.