Railway coolie got two armed policemen for protection: సాయుధ పోలీసులను రక్షణగా పెట్టుకుని పని చేస్తున్న రైల్వే కూలీ!.. కారణం తెలిస్తే షాక్!

సాయుధ పోలీసులను రక్షణగా పెట్టుకుని పని చేస్తున్న రైల్వే కూలీ!.. కారణం తెలిస్తే షాక్!

రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై ఎర్రటి చొక్కాలు ధరించి ప్రయాణికుల లగేజిని కంపార్ట్ మెంట్ల వరకు మోస్తూ, కంపార్ట్ మెంట్ల నుంచి కిందికి దించుతుంటారు. దీనికి కొంత మొత్తాన్ని తీసుకుంటారు కూలీలు. అయితే అక్కడ ఓ కూలీ మాత్రం రైల్వే కూలీగా పని చేస్తూ ఇద్దరు సాయుధ పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకున్నాడు. వారి రక్షణలో తన పని కొనసాగిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అదేంటీ రైల్వే కూలీకి సెక్యూరిటీ గార్డ్ ఎందుకు అని అంటారా? దీని వెనకాల ఓ పెద్ద స్టోరీనే ఉంది. ఆ కారణంతోనే ఆ కూలీకి రక్షణగా ఆర్ముడ్ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాగా బీహార్ లోని పాట్నా జంక్షన్ లో రైల్వే కూలీగా చేస్తున్న వ్యక్తి అంగరక్షకులు రక్షణ కల్పిస్తుండగా కూలీ పని చేస్తున్నాడు. రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ కూలీకి రక్షణ కల్పిస్తున్నారు. ఆ కూలీ పేరు ధర్మనాథ్ యాదవ్. ఇతడు పాట్నా జంక్షన్ లోని 10వ నెంబర్ ప్లాట్ ఫాం పై కూలీగా పనిచేస్తున్నాడు. కాగా 2013లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇతడికి సెక్యూరిటీ కల్పించాల్సి వచ్చింది. ప్రభుత్వమే ధర్మనాథ్ కు రక్షణ కల్పించింది.

2013 అక్టోబర్ లో పాట్నా జంక్షన్ సమీపంలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ హఠాత్పరిణామంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఉలికిపడ్డారు. బాండు దాడితో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుని భయానకంగా మారింది. ఆ సమయంలో కూలీ ధర్మనాథ్ ఓ యువకుడిని భుజాలపై వేసుకుని బయటకు వచ్చాడు. ఆ యువకుడు కరుడు గట్టిన తీవ్రవాది. అతడి పేరు ఇంతియాజ్. ఇతడు పట్టుబడడంతో గాంధీమైదాన్, బోద్ గయా పేళుల్ల రహస్యం బయటపడింది.

ఈ ఘటనతో కూలీ ధర్మనాథ్ కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బాంబు దాడి ఘటనలో ధర్మనాథ్ ప్రత్యక్ష సాక్షిగా మారడంతో పాకిస్తాన్ రూ. 50 లక్షల ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. కాగా ధర్మనాథ్ కు బెదిరింపులు ఎక్కువకావడంతో తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన కోర్టు కూలీకి రక్షణ గా ఇద్దరు సాయుధ పోలీసులను నియమిచేలా తీర్పు వెల్లడించింది. ఇక అప్పటి నుంచి అంగరక్షకుల నీడలో కూలీ ధర్మనాథ్ తన పనిని చేసుకుంటున్నాడు.

Show comments