Venkateswarlu
Venkateswarlu
పంజాబ్‌లో మతి పోయే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా 40 రకాల వస్తువుల్ని మింగేశాడు. వాటిలో స్క్రూలు, నట్లు, బోల్టులతో పాటు ఇయర్స్ ఫోన్స్ లాంటి పెద్ద వస్తువులు ఉన్నాయి. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అతడ్ని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని మోగాకు చెందికు చెందిన 40 ఏళ్ల కులదీప్ సింగ్ అనే వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
మంగళవారం అతడికి విపరీతమైన కడుపునొప్పి రావటంతో కుటుంబసభ్యులు మోగాల మెడికల్ సిటీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు ఆయనకు ఎక్స్ రే తీశారు. ఎక్స్ రేను పరీక్షించిన వైద్యుడు షాక్ తిన్నాడు. కులదీప్ కడుపులో చాలా వస్తువులు ఉన్నట్లు గుర్తించాడు. ఆపరేషన్ చేసి బయటకు తీయాలని చెప్పాడు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఆపరేషన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం 40 రకాలు వస్తువులు బయటపడ్డాయి. వాటిలో స్క్రూలు, నట్లు, బోల్టులతో పాటు ఇయర్స్ ఫోన్స్ లాంటి పెద్ద వస్తువులు ఉన్నాయి.
అతడు పీకా అనే కండీషన్‌తో బాధపడుతున్న కారణంగానే ఈ విధంగా వస్తువుల్ని మింగేశాడని డాక్టర్లు చెప్పారు. పదునైన వస్తువుల్ని కూడా తినటం వల్ల అతడి పేగులు పాడయ్యాయని తెలిపారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని అతడి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం అతడి కడుపులోంచి బయటకు తీసిన వస్తువులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
40 ਸਾਲ ਦੇ ਵਿਅਕਤੀ ਦੇ ਢਿੱਡ ‘ਚੋਂ ਨਿਕਲੀਆਂ ਅਹਿਜਿਆਂ ਚੀਜ਼ਾਂ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਦੇਖ ਸਬ ਦੇ ਉੱਡੇ ਹੋਸ਼ #moga #hospital #viralnews #viralposts #LatestNews #shortsvideos #PunjabNews #punjabnewstv pic.twitter.com/d1ZgRphLcN
— Punjab News tv (@5aabNewstv) September 27, 2023