గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర! ఎంతంటే?

LPG Cylinder Price Reduced: దేశంలో సామాన్యులు మార్కెట్ కి వెళ్లి సరుకులు తెవాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజకీ పెరిగిపోతూనే ఉన్నాయి. గ్యాస్ ధరల నుంచి ఆయిల్ ధరల వరకు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి.

LPG Cylinder Price Reduced: దేశంలో సామాన్యులు మార్కెట్ కి వెళ్లి సరుకులు తెవాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజకీ పెరిగిపోతూనే ఉన్నాయి. గ్యాస్ ధరల నుంచి ఆయిల్ ధరల వరకు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి.

ఇటీవల మార్కెట్ లో నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పాలు, నూనె, పప్పు, ఆయిల్ నుంచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. సంపాదన తక్కువ ఖర్చులు ఎక్కువ.. దీంతో సమాజంలో సామాన్యులు బతకడమే కష్టంగా మారుతుంది. ధరల మోతతో కష్టాలు పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు కాస్త ఊరటనిచ్చాయి. ఎన్నికల వేల మూడు సార్ల ధరలు తగ్గించడం గమనార్హం. వాణిజ్య (కమర్షియల్ గ్యాస్) సిలిండర్ వినియోగదారులకు చిన్నపాటి శుభవార్త చెప్పాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ.. గ్యాస్ ధర ఎంత వరకు తగ్గించారు అన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.69.50 వరకు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించారు. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. తాజాగా తగ్గిర ధరల ప్రకారం ఢిల్లీలో 19 కిలోట ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1,676 కు తగ్గింది. ఢిల్లీలో రూ.1,676, కోల్‌కొతాలో రూ.1,787, ముంబైలో రూ.1,629, చెన్నైలో రూ.1,840 మేర తగ్గాయి. మే 1 నుంచి కూడా రూ.19 మేర, అంతకు ముందు నెల ఏప్రిల్ రూ.30.50 వరకు తగ్గింది. దీంతో ఈ ఏడాది ఆర్థిక సవాళ్ల మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులను ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.

మరోవైపు గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఏ మార్పు లేదని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కెంపెనీలు సమీక్షిస్తుంటాయి.. అందులో భాగంగానే ఆయిల్ కంపెనీలు ధరల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రతి ఒక్కరూ గ్యాస్ వినియోగిస్తున్నారు.  కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్రం వరుసగా మూడోసారి తగ్గించడం మరో విశేషం. మొత్తానికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుదల కొంత మేరకు ఉపశమనం కలిగిస్తుందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show comments