Know This New Section: ప్రేమ పేరుతో మోసం చేస్తే.. కొత్త చట్టంలో శిక్ష ఏంటో తెలుసా?

ప్రేమ పేరుతో మోసం చేస్తే.. కొత్త చట్టంలో శిక్ష ఏంటో తెలుసా?

Know This New Section: ప్రేమ పేరుతో మోసం చేస్తే ఇంతకు ముందులా ఉండదు. ఇప్పుడు దారుణంగా ఉన్నాయి శిక్షలు. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఆల్మోస్ట్ అలాంటి శిక్ష ఇప్పుడు అమ్మాయిని మోసం చేసే అబ్బాయిలకు పడుతుంది.

Know This New Section: ప్రేమ పేరుతో మోసం చేస్తే ఇంతకు ముందులా ఉండదు. ఇప్పుడు దారుణంగా ఉన్నాయి శిక్షలు. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఆల్మోస్ట్ అలాంటి శిక్ష ఇప్పుడు అమ్మాయిని మోసం చేసే అబ్బాయిలకు పడుతుంది.

ప్రేమ పేరుతో అమ్మాయిలని కొంతమంది మోసం చేస్తుంటారు. ఈ క్రమంలో అమ్మాయిలు అబ్బాయిల ఇంటి ముందు నిరసన చేయడం, మోసపోయానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. పోలీస్ కేసు పెట్టినా జైలుకు వెళ్లే సందర్భాలు తక్కువ. ఒకవేళ వెళ్లినా కొన్ని రోజులకే బయటకు వచ్చేస్తున్నారు. దీని వల్ల చట్టం అంటే భయం లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు గుమ్మడికాయ కొట్టేసి.. ఆ స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. 

బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2023లో ఈ మూడు చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టాలు 2024 జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ కి బదులు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగం, ప్రమోషన్ లాంటివి ఆశ చూపించి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తే పదేళ్ల జైలు శిక్ష తప్పదు. సెక్షన్ 69 కేసు నమోదై నేరం రుజువైతే పదేళ్లు జైల్లోనే ఉండాలి. అయితే ఈ చట్టం వల్ల అమ్మాయిలు ఉద్దేశపూర్వకంగా అబ్బాయిలను వేధించే అవకాశాలు ఉంటాయని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అబ్బాయిలు మాత్రమేనా మోసం చేసేది.. అమ్మాయిలు కూడా మోసం చేస్తారు కదా. అలాంటప్పుడు మోసం చేసి లైంగిక సంబంధాలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత 69 చట్టం.. మగవారికి, ఆడవారికి ఇద్దరికీ వర్తించాలి కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని న్యాయ స్థానాలు ఎలా అమలు చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. నేరం జరిగినట్టు గుర్తించడం, ఆధారాలు సేకరించడం వంటి విషయాల్లో ఈ చట్టం కఠినంగా ఉన్నాయని అంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని అమ్మాయిలు అబ్బాయిలను ఒక ఆట ఆడుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

Show comments