ఆశీర్వదించడానికి ఇంటికి వెళ్లి..అనుకోకుండా మృతువు ఒడిలోకి!

ఆశీర్వదించడానికి ఇంటికి వెళ్లి..అనుకోకుండా మృతువు ఒడిలోకి!

కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులే మనపాలిట యమపాశంలాగా మారుతుంటాయి. తాజాగా ఓ పూజారి విషయంలో అదే జరిగింది. వేరే వాళ్ల ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లిన పూజారి.. ఓ చిన్న తప్పు చేయడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.

కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులే మనపాలిట యమపాశంలాగా మారుతుంటాయి. తాజాగా ఓ పూజారి విషయంలో అదే జరిగింది. వేరే వాళ్ల ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లిన పూజారి.. ఓ చిన్న తప్పు చేయడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.

మనిషికి  మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం ఊహించలేదు. ముఖ్యంగా అప్పటి వరకు ఎంతో హుషారుగా  కనిపించే వారిని ఏదో ఒక రూపంలో వచ్చి మృత్యువు కాట్టేస్తుంది.  ఇది ఇలా ఉంటే కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులే మనపాలిట యమపాశంలాగా మారుతుంటాయి. తాజాగా ఓ పూజారి విషయంలో అదే జరిగింది. వేరే వాళ్ల ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లిన పూజారి.. ఓ చిన్న తప్పు చేయడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి ప్రాంతంలో నర్సింహా మూర్తి అనే పూజారి తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా పూజ కార్యక్రమాలు చేస్తూ..  జీవనం సాగిస్తున్నాడు. తరచూ అక్కడ ఉండే అపార్ట్మెంట్స్, ఇళ్లలో పూజలు నిర్వహిస్తుంటారు. అలానే మంగళవారం కూడా ఓ ఇంట్లో పూజ చేయడానకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఈస్ట్ మారేడ్ పల్లి ప్రాంతంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. మారేడ్ పల్లిలోని డి.ప్రీతం ఇంట్లో పూజ నిర్వహించడానికి నర్సింహా మూర్తికి ఆహ్వానం వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రీతం ఇంట్లో పూజ నిర్వహించేందుకు పూజారి నర్సింహా మూర్తి వెళ్లారు.

ఇదే సమంయలో లిఫ్ట్ ద్వారా వెళ్లేందుకు దాని ముందు నిల్చుకున్నారు. అంతేకాక లిఫ్ట్ రాక ముందే గేట్ తెరచి..అందులోకి ప్రవేశించాడు. అయితే అప్పటికి లిఫ్ట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో పడిపోయాడు. అంతలోనే పైనుంచి లిఫ్ట్ వచ్చి..నర్సింహా మూర్తి మీద పడిపోయింది. దీంతో పూజారి నర్సింహా మూర్తి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజరీ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పూజారి మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.

గతంలో కూడా లిఫ్ట్ కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా లోపలికి వెళ్లడం, సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు మరణించగా, మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని సార్లు లిఫ్ట్ లు మధ్యలో స్ట్రక్ అయ్యి.. ఊపిరి ఆడగక చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అయితే లిఫ్ట్ ను సరిగ్గా మెయిటైన్ చేయకపోవడం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి..లిఫ్ట్ ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments