ఢిల్లీలో మరోసారి భూకంపం.. పరుగులు పెట్టిన జనం!

ఇటీవల దేశంలో వరుస భూకంపాలతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం భారత్ పై కూడా పడుతుంది.

ఇటీవల దేశంలో వరుస భూకంపాలతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం భారత్ పై కూడా పడుతుంది.

ఈ మద్య ప్రపంచంలో వరుసగా భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వచ్చి రెండు వేల మందికి పైగా చనిపోయారు. ఈ నెలలో నేపాల్ లో సంభవించిన భూకంపానికి భారీ ఆస్తి నష్టంతో పాటు 160 మందికి పైగా చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా భారత్, పాకిస్థాన్, నేపాల్, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి.  ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఢిల్లీ ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. దీనికి తోడు వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం ఢిల్లీలో మధ్యాహ్నం 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర జిల్లాలో భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల దిగువన ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఒక్కసారే భూమి కంపిచడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

ఈ మధ్యనే నేపాల్ లో సంభవించిన భూకంప ప్రభావం ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. వెస్ట్ నేపాల్ లో రిక్టర్ స్కేట్ పై 5.6 మ్యాగ్నిట్యూడ్ భూ ప్రకంపనలు నమోదు కావడం వల్ల ఆ ప్రభావం ఢిల్లీ పరిసర ప్రాంతంపై పడిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ సహా ఎస్‌సీఆర్ ప్రాంతాల్లో భూకం విషయంలో జోన్ 4 కిందికి వస్తాయి.. ఈ జోన్ లోని ప్రాంతాలకు తరుచూ భూకంపాలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మిగిల్చిన విషయం తెలిసిందే. ఏకంగా 50 వేల మందికి పైగా చనిపోయారు.

Show comments