SSMB 29లో ఆ బాలీవుడ్ భామ.. !

ప్రతి సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి అందులో నటి నటులను పరిచయం చేసే జక్కన్న..SSMB29 విషయంలో మాత్రం అంతా సీక్రెట్ గా ఉంచుతున్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్సుమెంట్స్ అయితే రావడం లేదు లే కానీ.. ఇన్సైడ్ టాక్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి.

ప్రతి సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి అందులో నటి నటులను పరిచయం చేసే జక్కన్న..SSMB29 విషయంలో మాత్రం అంతా సీక్రెట్ గా ఉంచుతున్నాడు. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్సుమెంట్స్ అయితే రావడం లేదు లే కానీ.. ఇన్సైడ్ టాక్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి.

అసలు సినిమా నుంచి ఏ అప్డేట్స్ రాకుండానే.. ఆ సినిమా మీద సూపర్ హైప్ క్రియేట్ అవుతుంది అంటే.. దాని వెనుక ఉన్నదీ రాజమౌళి అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు SSMB29 విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్సుమెంట్స్ అయితే రావడం లేదు లే కానీ.. ఇన్సైడ్ టాక్స్ మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ప్రతి సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి అందులో నటి నటులను పరిచయం చేసే జక్కన్న.. ఈ సినిమా విషయంలో మాత్రం అంతా సీక్రెట్ గా ఉంచుతున్నాడు. ఒకేసారి తీరుపై చూపించి ప్రేక్షకులను సర్ప్రైస్ చేద్దామని ఆలోచిస్తున్నాడో ఏమో మరి.

పైగా అంతకముందు సినిమాలలా కాకుండా ఈ సినిమాను షూటింగ్ ను కొంచెం స్పీడ్ గా కంప్లీట్ చేయనున్నాడట. ఇప్పటికే SSMB 29 కు సంబందించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో  ప్రియాంక చోప్రా భాగం కానుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రియాంక చోప్రా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొందట . ఇక ఇప్పుడు వినిపిస్తున్న మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో శ్ర‌ద్ధా క‌పూర్ ను తీసుకునే ఆలోచ‌న‌లో మూవీ టీం ఉన్నారట. సెకండాఫ్ లో శ్రద్ద ఎంట్రీ ఉండొచ్చని టాక్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం.. సినిమా రేంజ్ ఇంకాస్త పెరుగుతుందన్న మాట వాస్తవం.

ఇక వీరు కాకుండా ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథను ద‌క్షిణాఫ్రికా న‌వ‌లా ర‌చ‌యిత విల్బ‌ర్ట్ స్మిత్ బుక్స్ ఆధారంగా రాసినట్లు గతంలో ఓసారి టాక్ వినిపించింది. మరి ఆ కథ ఎలా ఉండబోతుంది అనేది నేరుగా తెరపై చూస్తే కానీ తెలియదు. ఇక ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments