iDreamPost
android-app
ios-app

Pushpa 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2!

  • Published Dec 03, 2024 | 11:36 AM Updated Updated Dec 03, 2024 | 11:36 AM

Pushpa 2: ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ దేశవ్యాప్తంగా మామూలుగా లేదనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

Pushpa 2: ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ దేశవ్యాప్తంగా మామూలుగా లేదనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

Pushpa 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2!

పుష్ప 2 టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ చూస్తుంటే అన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలున్నాయని సినీ నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో శనివారం సాయంత్రం బుకింగ్స్ స్టార్ట్ కాగా, కేరళలో డిసెంబర్ 1న అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక నిన్న అయితే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో రికార్డులు సృష్టించింది పుష్ప 2. ఏకంగా 60 వేల కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలిరోజే ఏకంగా 2.80 లక్షల పైగా టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇది నిజంగా సూపర్ డూపర్ రికార్డ్ అనే చెప్పాలి. టైటిల్ కి తగ్గట్టే పుష్ప రికార్డులు సృష్టిస్తూ రూల్ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా పుష్పాకి టికెట్లు తెగుతూనే ఉన్నాయి.

బన్నీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో మామూలు సందడి లేదనే చెప్పాలి. డిసెంబర్ 01న కేరళలో పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వగా… ఓపెనింగ్ అయిన వెంటనే మెయిన్ థియేటర్లలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా ఇండియాలో దాదాపు 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ఇక ఓవర్సీస్, వరల్డ్ వైడ్ గా అయితే ఏకంగా 40 కోట్ల పైగా గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అమెరికాలో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో ఉన్నాయని తెలుస్తుంది. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇప్పటి దాకా రూ.16 కోట్లకు పైగా టిక్కెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పుష్ప 2 సినిమా సాలిడ్ రికార్డులు నమోదు చేస్తుంది.

ఇక డిసెంబర్ 4న నార్త్ అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణలో కూడా పుష్ప 2 బెనిఫిట్ షోస్ పడనున్నాయి. దీంతో ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమా మొదటి కచ్చితంగా 160 కోట్ల నుంచి 200 కోట్ల దాకా వసూళ్లు రాబట్టే ఛాన్స్ బలంగా ఉందని తెలుస్తుంది. ఈ నెంబర్ పెరిగినా కూడా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో ఈ సినిమా కచ్చితంగా పాత రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అని తెలుస్తుంది. మరి చూడాలి పుష్పరాజ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో.. పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.