యజ్ఞం మూవీ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

హీరోలతో పోలిస్తే.. యాక్టింగ్ పరంగా హీరోయిన్లకు లైఫ్ టైమ్ చాలా తక్కువ. ఉన్న కొద్ది సమయంలోనే ఆఫర్లను ఒడిసిపట్టి.. గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ కొంత మంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతో వెండితెరకు గుడ్ బై చెప్పేస్తున్నారు.. లేదంటే..

హీరోలతో పోలిస్తే.. యాక్టింగ్ పరంగా హీరోయిన్లకు లైఫ్ టైమ్ చాలా తక్కువ. ఉన్న కొద్ది సమయంలోనే ఆఫర్లను ఒడిసిపట్టి.. గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ కొంత మంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతో వెండితెరకు గుడ్ బై చెప్పేస్తున్నారు.. లేదంటే..

ఇండస్ట్రీలోకి అడుగుపెడదామని లేదా ఇతర సినిమా, టీవీ రంగాల్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న నటీమణులు కానీ తమ నటనా ప్రదర్శనను మెరుగు పర్చుకునేందుకు టాలీవుడ్ పరిశ్రమకు వచ్చి ప్రాక్టీసులు చేస్తుంటారు. ఒకటి రెండు సినిమాలు చేశాక..తమ సొంత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి షైన్ అవుతుంటారు. కత్రినా కైఫ్ మొదలుకుని, నిన్న వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ వరకు ఆ కోవకే వస్తారు. తెలుగులో అరకొర సినిమాలు చేసి.. ఆ తర్వాత తమకు నచ్చిన ఇండస్ట్రీలో పాతుకుపోతూ టాప్ హీరోయిన్లుగా రాణిస్తుంటారు. అవకాశాలు రాకపోతే.. మరో మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటి కూడా ఆ జాబితాకు చెందిందే.  ఒకే ఒక సినిమా చేసి వెండితెరకు దూరమై.. బుల్లితెరపై రాణిస్తుంది.

గోపిచంద్.. ఈ నటుడు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలి వలపు సినిమాతో సోసో అనిపించినా..ప్రముఖ డైరెక్టర్ టి కృష్ణ గారి అబ్బాయి.. ఆ తర్వాత విలన్ గా రాణించాడు. వర్షం, జయం మూవీస్‌తో హీరో మెటీరియల్ విలన్‌గా మారుతున్న సమయంలో వచ్చిన మూవీ యజ్ఞం. ఈ సినిమా అతడి కెరీర్‌నే టర్న్ చేసేసింది. హీరోగా నిలబెట్టింది. 2004లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలోనే హీరోయిన్‌గా నటించింది కోల్ కతా భామ మున్ మున్ బెనర్జీ అలియాస్ మహువా.. అలియాస్ సమీరా బెనర్జీ. ఈ మూవీలో శైలజ అనే క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది కానీ అవకాశాలను తీసుకురాలేదు.

ఇప్పటి వరకు ఆమె తొలి సినిమా, చివరి మూవీ కూడా ఇదే. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై ఇంట్రస్ట్‌తో మోడల్ గా కెరీర్ స్టార్ చేసి.. అనేక టీవీ యాడ్స్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత బుల్లితెర నుండి కెరీర్ స్టార్ చేసిన ఈ చిన్నది.. ఏక్తా కపూర్ సీరియల్స్‌లో నటిచింది. యజ్ఞం తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో మళ్లీ తన స్వస్థలానికి వెళ్లిపోయి.. ధారావాహికల్లో నటించడం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే నిర్మాత నీరజ్ శర్మను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఓ బాబు ఉన్నాడు. అయితే ఆ తర్వాత హిందీ సీరియల్స్‪లో అమ్మ, వదిన, అక్క వంటి పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ నటి సోషల్ మీడియాలో వెతికితే..అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ శైలు.. ఈమె ఒక్కటేనా అనిపించకమానదు. మరీ ఈ ఫోటోలు చూసి.. మీకేమనిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments