మోదీ పర్యటన.. ‘‘బాయ్‌ కాట్‌ మాల్దీవ్స్‌’’.. వివాదానికి అసలు కారకులెవరు?

Boycott Maldives News in Telugu: మాల్దీవ్స్‌ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ అనేది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది.

Boycott Maldives News in Telugu: మాల్దీవ్స్‌ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ అనేది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది.

మాల్దీవ్స్‌కు చెందిన కొంతమంది మంత్రులు భారతీయులపై.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘‘ బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెలెబ్రిటీలు సైతం బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులుసైతం పెడుతున్నారు. అక్షయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘  మాల్దీవ్స్‌కు చెందిన కొంతమంది ప్రముఖులు ఇండియన్స్‌పై చేసిన వ్యాఖ్యలకు గురించి నాకు తెలిసింది.

ఎక్కువ మంది టూరిస్టులను మాల్దీవ్స్‌కు పంపే దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మనం మన పొరుగు వారితో మంచిగా ఉండాలి. కానీ, ఇలాంటి వాటిని ఎందుకు సహించాలి. నేను చాలా సార్లు మాల్దీవ్స్‌కు వెళ్లాను. ప్రశంసలు కురిపించాను. కానీ, మనకు డిగ్నిటీ అన్నది ముఖ్యం. ఇకపై మనం మన సొంత టూరిజాన్ని అభివృద్ధి చేసుకుందాం’’ అని అన్నారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా దీనిపై స్పందిస్తూ.. ‘‘
‘‘ఎంతో పరిశుభ్రమైన లక్షద్వీప్‌లో మన గౌరవనీయులైన నరేంద్ర మోదీని చూడటం చాలా బాగుంది. అందులో కూడా అద్భుతమైన విషయం ఏంటంటే.. అవి మన భారతదేశంలో ఉన్నాయి’’ అని అన్నారు.

ఇంతకూ గొడవ ఏంటంటే.. 

ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘ వే ఆఫ్‌ ది వరల్డ్‌’’ అనే ట్విటర్‌ ఖాతా ఓ పోస్టు పెట్టింది.. అందులో.. ‘‘ ఇండియాలో కొంతమంది పబ్లిక్‌ ప్లేసుల్లో మల,మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. వారు ఈ అలవాట్లను వెస్ట్‌కు కూడా తీసుకు వస్తున్నారు’’ అని ఉంది. ఆ ట్వీట్‌ను మాల్దీవ్స్‌కు చెందిన మంత్రి అబ్దుల్లా మహజూమ్‌ మజిద్‌ రీ ట్వీట్‌ చేశారు. ‘‘ నేను ఇండియాన్‌ టూరిజం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. భారత్‌ క్లియర్‌గా మాల్దీవ్స్‌ను టార్గెట్‌ చేయటం దౌత్య పరమైన విషయాలను దెబ్బతియ్యదు. బీచెస్‌ టూరిజంలో భారత్‌ చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఐలాండ్స్‌ కంటే.. మా రీసార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది మీ సంప్రదాయం నరేంద్ర మోదీ’’ అంటూ ఆ ట్వీట్‌ను నరేంద్ర మోదీకి ట్యాగ్‌ చేశారు.

మరో మంత్రి జాహిద్‌ రమీజ్‌ కూడా తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది. అయితే, మీరు మాతో పోటీ పడాలనుకునే ఆలోచన మాత్రం ఉత్తిదే.. మేము ఇచ్చే సర్వీసులను మీరు ఎలా ఆఫర్‌ చేయగలరు. మీరు ఎలా అంత శుభ్రంగా ఉండగలరు. మీ రూముల్లో శాశ్వతమైన ఓ వాసన వస్తూ ఉంటుంది. అదే మీకు పెద్ద సమస్య’’ అని అన్నారు.

మరో మంత్రి కూడా భారత్‌కు వ్యతిరేకంగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలోనే కాదు.. బయట కూడా వివాదానికి దారి తీసింది. మాల్దీవ్స్‌లోని ఇండియన్‌ హై కమిషన్‌ ఆదివారం దీనిపై తీవ్రంగా స్పందించింది. దీంతో మాల్దీవ్స్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్దమైంది. భారతీయులపై.. భారత్‌పై.. మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్‌ చేసింది. మరి, సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్న ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ ’’ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments