Actor Thrigun marriage photos viral: ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

ఓ ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు యంగ్ హీరోలు తమ బ్యాచ్ లర్ లైఫ్ కు బైబై చెప్పి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల శర్వానంద్ పెళ్లి చేసుకుని వివాహబందంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన మరో క్రేజీ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆరు ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇటీవల పెద్దల అంగీకారంతో అంగరంగవైభవంగా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఓ యంగ్ హీరో వివాహ బందంలోకి అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? తను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తొలి చిత్రం కథ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్‌ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటించారు. తాజాగా త్రిగుణ్‌ ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడుకు చెందిన నివేదితను వివాహమాడాడు. వీరి పెళ్లి తిరుప్పూర్ లో కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల హాజరవ్వగా అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నూతన జంటకు నెటిజన్లతో పాటు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక రీసెంట్ గా త్రిగుణ్‌ చేసిన సినిమా ప్రేమదేశం. కానీ ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Show comments