Virat Kohli: IPLలో బ్యాట్​తో దుమ్మురేపుతున్న కోహ్లీ.. సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశాడు!

ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. సీజన్​లో టాప్ స్కోరర్​గా ఉన్న కింగ్.. గత కొన్ని మ్యాచుల్లో మరింత జోరు పెంచాడు. వేగంగా పరుగులు చేస్తూ ఆర్సీబీని మళ్లీ విజయాల బాట పట్టించాడు.

ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. సీజన్​లో టాప్ స్కోరర్​గా ఉన్న కింగ్.. గత కొన్ని మ్యాచుల్లో మరింత జోరు పెంచాడు. వేగంగా పరుగులు చేస్తూ ఆర్సీబీని మళ్లీ విజయాల బాట పట్టించాడు.

టీ20 వరల్డ్ కప్​కు ముందు సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ ఫుల్​ ఫామ్​లోకి వచ్చేశాడు. ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు. ఆర్సీబీ గెలుపు కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్​లోనూ తన వంతు కృషి చేస్తున్నాడు. క్లిష్టమైన క్యాచులు అందుకోవడమే గాక గ్రౌండ్​లో పాదరసంలా కదులుతూ బుల్లెట్ త్రోలతో సూపర్బ్​గా రనౌట్స్ చేస్తున్నాడు. ఈ సీజన్​లో ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచుల్లో 634 పరుగులు చేశాడు. దీన్ని బట్టే అతడి బ్యాట్ ఏ రేంజ్​లో గర్జిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత బాగా ఆడుతున్నా కోహ్లీకి విమర్శల బెడద తప్పడం లేదు. స్లోగా ఆడుతున్నాడని, ఇలాగే బ్యాటింగ్ చేస్తే ఇక వరల్డ్ కప్ కొట్టినట్లేనని విరాట్​ను కొందరు ట్రోల్ చేస్తున్నారు.

బ్యాటింగ్​పై వస్తున్న ట్రోల్స్​ను సీరియస్​గా తీసుకున్నాడు కోహ్లీ. గత కొన్ని మ్యాచులుగా వేగంగా పరుగులు చేయడంపై ఫోకస్ పెట్టాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేస్తూ తన స్ట్రైక్ రేట్​ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. చివరి కొన్ని మ్యాచుల్లో అతడి స్ట్రైక్ రేట్ 155 నుంచి 200 మధ్యలో ఉంది. దీన్ని బట్టే కోహ్లీ ఎంత బాగా ఆడుతున్నాడు, క్విక్​గా రన్స్ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్​లో విజయవంతం అవడంపై విరాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో అతడు రివీల్ చేశాడు. ఆ టెక్నిక్​ను ఫాలో అవడం వల్లే ఇంత బాగా ఆడగలుగుతున్నానని అన్నాడు. మరి.. కోహ్లీ అనుసరిస్తున్న ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్వాలిటీ కంటే క్వాంటిటీనే తాను నమ్ముతానని, ప్రతి ప్రాక్టీస్ సెషన్​లో దీన్నే అనుసరిస్తున్నానని కోహ్లీ తెలిపాడు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని చెప్పాడు. ఎంత సేపు ప్రాక్టీస్ చేశామనే దాని కంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేశాం అనేది ముఖ్యమని అన్నాడు. ‘నాకు క్వాలిటీ కంటే క్వాంటిటీనే ముఖ్యం. ప్రతి ప్రాక్టీస్ సెషన్​లో దీన్ని ఆచరణలో పెడుతుంటా. క్రికెట్ ఇప్పుడు బాగా ఎవాల్వ్ అవుతోంది. గేమ్​లో వేగంగా మార్పులు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నా బ్యాటింగ్ స్టైల్​ను ఇప్పటి ఆటకు తగ్గట్లు మార్చుకోవడంపై ఫోకస్ చేస్తున్నా. ఎక్స్​ట్రా రిస్క్ తీసుకొని మిడిల్ ఓవర్స్​లో భారీగా పరుగులు రాబట్టడంపై పని చేస్తున్నా. నా స్ట్రైక్ రేట్ మెరుగుపడటానికి అదే రీజన్. ఇది ఎంతో మార్పు తీసుకొచ్చింది. దీని వల్ల టీమ్​ కూడా బెనిఫిట్ అవుతోంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Show comments