Arjun Suravaram
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వసతి గృహంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరం 13 కుటుంబాల్లో విషాదం నింపింది.
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వసతి గృహంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరం 13 కుటుంబాల్లో విషాదం నింపింది.
Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్నిప్రమాదాల ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి.. ఎనిమిది మంది మరణించారు. తాజాగా ఓ హాస్టల్ లో అగ్నిప్రమాదం జరిగి ఏకంగా 13 మంది విద్యార్థులు మరణించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది. వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
శుక్రవారం చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ పాఠశాలకు చెందిన వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హెనాన్ ప్రావిన్స్ లోని యింగ్ కాయ్ అనే పాఠశాల హస్టల్ లో రాత్రి 11 గంటలక సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు ఆ భవనం మొత్తాన్ని చుట్టు ముట్టాయి. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.
ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేసింది. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ మూడో తరగతి చదువుతున్నట్లు సదరు పాఠశాల ఉపాధ్యాయుడు మీడియాకు వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల నివారణ రూల్స్ ను పాటించని సదరు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గతంలోనూ ఉత్తర చైనాలో ఓ బొగ్గు కంపెనీలు అగ్నిప్రమాదం జరిగి..26 మంది మరణించారు. తాజాగా ఈ ఘటన జరగడంతో 13 మంది విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎవరో చేసిన తప్పుకు అభంశుభం తెలియని పసిపిల్లలు బలయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే గద్వాల జిల్లాలో ఓ బస్సులో ప్రమాదం జరిగి ఓ మహిళ సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఇలా తరచూ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు మంటల్లో కాలిపోతున్నారు. గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా మరి.. ఇలాంటి విషాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.