పిల్ల జమిందార్.. వందల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుడిలా యువకుడు!

కష్టం విలువ తెలిసిన వారే జీవితంలో పైకి వస్తారనేది  చాలా మంది అభిప్రాయం. అందుకే కొందరు తమ పిల్లలకు కష్టం విలువ తెలిసేలా చేస్తుంటారు. ఓ తండ్రి కూడా వందల కోట్ల ఆస్తి ఉన్నా కొడుకును సామాన్యుడిలాగానే పెంచారు.

కష్టం విలువ తెలిసిన వారే జీవితంలో పైకి వస్తారనేది  చాలా మంది అభిప్రాయం. అందుకే కొందరు తమ పిల్లలకు కష్టం విలువ తెలిసేలా చేస్తుంటారు. ఓ తండ్రి కూడా వందల కోట్ల ఆస్తి ఉన్నా కొడుకును సామాన్యుడిలాగానే పెంచారు.

జీవితంలో సక్సెస్ సాధించిన వారు ఎందరో కనిపిస్తుంటారు. అయితే వారి విజయం అనేది అంత ఆషామాషిగా వచ్చి ఉండదు. ముఖ్యంగా ఇలా విజేతలుగా నిలిచిన వారిలో ఎక్కువ మంది అతి సామాన్య, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే ఉంటారు. కష్టం విలువ తెలిసిన వారే జీవితంలో పైకి వస్తారనేది  చాలా మంది అభిప్రాయం. అలా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ధనవంతులుగా మారిన వారు తమ పిల్లలను సుఖంగా చూసుకోవాలని భావిస్తుంటారు. కొందరు ధనవంతులు మాత్రం తమ పిల్లలకు కూడా కష్టం విలువ తెలిసేలా చేస్తుంటారు. అలాంటి ఓ తండ్రి.. వందల కోట్ల ఆస్తి ఉన్న.. కొడుకును సామాన్యుడిలాగానే పెంచారు. అసలు ఈ తండ్రీకొడుకుల స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పిల్ల జమిందార్ అనే మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోకు కోట్ల ఆస్తి ఉన్న సరే తన తాత పెట్టి షరతు కారణంగా అతి సామాన్యుడిగా, మాములు యువకుల మధ్య తన చదువును సాగిస్తాడు. ఈ క్రమంలోనే జీవితానికి సరిపోయే పాఠాలు నేర్చుకుంటాడు. తన తాత పెట్టిన పరీక్ష విలువ తెలుసుకుని చాలా సంతోషిస్తాడు. అచ్చం అలానే ఓ తండ్రి కూడా తన కుమారుడు సామాన్యుడిగానే పెరిగితే జీవితంలో విజయం సాధిస్తాడని బలంగా నమ్మారు. అందుకే తనకు వేల కోట్ల ఆస్తి ఉన్నా.. ఆ విషయం తన కొడుకు చెప్పకుండా చాలా కాలం పాటు పెంచాడు.  చివరకు అసలు విషయం తెలిసి యువకుడు షాకయ్యాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. మరి.. ఆ తండ్రి స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చైనాలో చిరుతిండ్ల బ్రాండ్ ‘మాలా ప్రిన్స్’ కు ఎంతో పేరు ఉంది. మార్కెట్ లో మాలా ప్రిన్స్ ఫుడ్ ఐటమ్స్ కి మంచి డిమాండ్ ఉంది. ‘మాలా ప్రిన్స్’ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్. ఎంతో కష్టపడి తన సంస్థకు  మార్కెట్ లో మంచి బ్రాండ్ సృష్టించారు. ప్రస్తుతం ఏటా రూ.690 కోట్ల వ్యాపార టర్నోవర్ యుడాంగ్‌ సంస్థలో జరుగుతుంది. అయితే ఇలా తనకున్న రూ.వందల కోట్ల ఆస్తుల విషయం కుమారుడు జాంగ్‌ జిలాంగ్‌కు ఆయన చెప్పలేదు. అలా జాంగ్ జిలాంగ్ చిన్నతనం నుంచి కూడా ఓ సామాన్యుడిలానే పెరిగారు. చివరకు అతడికి 20 ఏళ్లు వచ్చాకే తమ సంపద గురించి  యుడాంగ్ వెల్లడించారు. దీనిపై యుడాంగ్ కుమారుడు జాంగ్‌ జిలాంగ్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి స్థాపించిన బ్రాండ్‌ గురించి తెలుసని, అయితే తమ వ్యాపారం అప్పుల్లో ఉందని తరచూ చెప్పేవారని జిలాంగ్ తెలిపారు.

అంతేకాక పింగ్‌జియాంగ్‌ కౌంటీలోని ఒక మధ్యతరగతి ఇంట్లో తన బాల్య జీవితం సాగిందని పేర్కొన్నాడు. అంతేకాక ఎక్కడ కూడా తన కుటుంబం పేరు ప్రస్తావించకుండా ఉండాలని కండిషన్ పెట్టాడని తండ్రి తెలిపాడు. అదే విధంగా ఉపయోగించకుండా విద్యాభ్యాసం పూర్తిచేశానని చెప్పొక్చాడు. ఇక తాను గ్రాడ్యుయేషను తర్వాత అప్పులు తీర్చేందుకు ఒక మంచి ఉద్యోగం చూసుకోవాలనుకొన్నాని జిలాంగ్ భావించాడు. అలా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న సమయంలో తన తండ్రి అసలు విషయం చెప్పారని అతడు తెలిపాడు. ఈ అసలు నిజయం బయటపడిన తర్వాతే యుడాంగ్‌ కుటుంబం ఖరీదైన విల్లాలోకి మారింది. మనిషి సాధారణ వ్యక్తిగా పెరిగితేనే జీవితంలో విజయం సాధించడం కోసం కష్టపడి పనిచేస్తాడనేది జాంగ్‌ యుడాంగ్‌ అభిప్రాయం. అందే తన కొడుకును అలా పెంచాడు. మరి..ఈ  తండ్రిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments