జువైనల్‌ హోంలో దారుణం.. బాలికని మంచానికి కట్టేసి!

దేశంలో ఎక్కడా ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. ఆఖరికి జువైనల్‌ హోంలో కూడా ఆడపిల్లలకు భద్రత లేకుండాపోతోంది. జువైనల్‌ హోం అధికారులే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, జువెనైల్‌ హోం సూపరెంటెండెంట్‌ ఓ బాలికపై దారుణానికి పాల్పడింది. ఓ బాలికను కొట్టడమే కాకుండా.. మంచానికి తాడుతో కట్టేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ జువైనల్‌ ఉంది. ఈ జువైనల్‌ హోంకు పూనమ్‌ పాల్‌ సూపరెంటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఆమె హోంలోని పిల్లలతో చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా, ఓ బాలికను కొట్టడమే కాకుండా.. మంచానికి సైతం కట్టిపడేసి చిత్రహింసలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అధికారులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. పూనమ్‌ పాల్‌ గతంలోనూ చాలా సార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డట్టు తేలింది.

అంతేకాదు! ఈమె కారణంగా ఓ బాలిక ఆత్మహత్యకు సైతం ప్రయత్నించినట్లు తేలింది. దీంతో ఆమెను విధులనుంచి తొలగించారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా జడ్జితో పాటు ఇతరులు ఆ జువైనల్‌ హోంకు వెళ్లి అక్కడి పరిస్థితులను ఆరాతీశారు. అక్కడ పరిస్థితులు సరిగా లేవని గుర్తించారు. తిండి విషయంలోనూ అధికారులు దారుణంగా వ్యహరిస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో హోం సిబ్బందితో పాటు అధికారులపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments