Krishna Kowshik
ఇంట్లో భార్య ఉండగానే.. ఆఫీస్‌లో ప్రియురాలిని మెయిన్ టైన్ చేస్తున్నాడు భర్త. భర్త మరొకరితో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్నాడని తెలియక.. కట్టుకున్నవాడు శ్రీరామ చంద్రుడు అన్న అపోహలో బతికేస్తుంది భార్య. కానీ అతడు చేసిన ఈ తప్పు..
ఇంట్లో భార్య ఉండగానే.. ఆఫీస్‌లో ప్రియురాలిని మెయిన్ టైన్ చేస్తున్నాడు భర్త. భర్త మరొకరితో సరస సల్లాపాల్లో మునిగి తేలుతున్నాడని తెలియక.. కట్టుకున్నవాడు శ్రీరామ చంద్రుడు అన్న అపోహలో బతికేస్తుంది భార్య. కానీ అతడు చేసిన ఈ తప్పు..
Krishna Kowshik
సినిమాల నుండి మంచి కన్నా చెడే ఎక్కువ తీసుకుంటున్నారు. హత్య చేసి తప్పించుకు తిరగడం ఎలా అని దృశ్యం మూవీని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు చాలా మంది. తప్పు చేస్తూ తప్పించుకునే మార్గాలను కూడా మూవీ ఆధారంగా నేర్చుకుంటున్నారంటే..ఈ లోకం ఎటు పోతుందో అన్న అనుమానం కలగకమానదు. తాజాగా అటువంటి ఓ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వారిద్దరు ఉపాధ్యాయులు. పిల్లలకు పాఠాలు నేర్పాల్సింది పోయి.. వీరు ప్రేమ పాటల్లో మునిగి తేలారు. వీరి ప్రేమ.. మరింత దగ్గరయ్యి సహజీవనానికి దారి తీసింది. దీంతో అతడికి సర్వస్వం అప్పగించింది మహిళా టీచర్. అయితే ఈ ఇద్దరు మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. అప్పట్లో ఇదొక సంచలన వార్తగా మారింది.
ఇద్దరు ఉపాధ్యాయులు మూడు నెలల క్రితం అదృశ్యమైన ఘటనలో ఒకరిని గురువారం పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వెలుగులోకి వచ్చింది. దృశ్యం తరహాలో సినిమా చూపించాడు టీచర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరంబలూరులోని వి కలత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ వెంకటేశన్, దీపా ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో నవంబర్ 15 ఈ ఇద్దరు కనిపించకుండా పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులకు డిసెంబర్ 1న కోయంబత్తూరు నగరంలోని ఉక్కడంలో దీప కారును వదిలివేయగా.. రక్తపు మరకలతో కూడిన సుత్తి, ఆభరణాలు, రెండు మొబైల్స్ లభించాయి.
ఈ కేసులో ఏదో లాజిక్ మిస్సవుతుందని భావించిన పోలీసులు.. దర్యాప్తు మరింత ముమ్మురం చేశారు. ఫిబ్రవరి 8న మెరీనా బీచ్ లో ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి విచారించగా.. దీపాను తానే చంపినట్లు అంగీకరించాడు. దీప నుండి 19 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్న వెంకటేశన్..ఆన్ లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. అయితే తన డబ్బులు తనకు ఇవ్వాలని దీపా పట్టుబడటంతో ఆమెను చంపేయాలని భావించాడు. తన డబ్బులు ఇస్తానని దీపకు మాయ మాటలు చెప్పగా.. ఇద్దరు కలిసి ఆమె కారులో వెళ్లారు. పెరంబలూరులోని మురుకన్ కుడి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఆమెను కొట్టి చంపాడు.
అనంతరం.. మృతదేహాన్ని వెల్లార్ నది ఒడ్డుకు తరలించాడు. అక్కడ వెళ్లాక మనస్సు మార్చుకుని.. చివరకు పుదుకొట్టై జిల్లాలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దీప మృతదేహాన్ని దహనం చేశాడు. ఉక్కడంలో కారును వదిలి పెట్టి.. కేరళలోని పాలక్కడాడ్.. ఆపై చెన్నైకి ప్రయాణించడం మొదలు పెట్టాడు. మధురై, దిండిగల్, తేనీ ఇలా మూడు నెలల పాటు తిరుగుతూనే ఉన్నాడు. ఫోన్ అయితే ట్రాక్ చేస్తున్నారని తెలిసి.. మొబైల్ మాట్లాడటం మానేశాడు. గుడిలో పంచే ప్రసాదాలను ఆహారంగా తీసుకుని నెట్టుకొచ్చాడు. చెన్నైలోని మైలాపూర్‌లో అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసి.. మెరీనా బీచ్ లో సంచరిస్తుండగా.. పోలీసులు పట్టుకుని విచారించగా.. ఆమెను చంపి.. ఖననం చేసినట్లు అంగీకరించాడు. కాగా, ఇందులో వెంకటేశన్ భార్య గాయత్రి (స్కూల్ లేబరేటరీ అసిస్టెంట్) ప్రమేయం ఉందని భావించిన అధికారులు..ఇద్దరిని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేశారు.