Krishna Kowshik
తన కంటే ముందే పెళ్లి చేసుకున్నానన్న బాధ చెల్లెలిలో ఉంది. ఎట్టకేలకు అక్కకు మంచి సంబంధం కుదిరింది. ఎంతో ఆనందంగా తన అత్తను తీసుకుని అక్క పెళ్లికి వెళ్లింది చెల్లెలు
తన కంటే ముందే పెళ్లి చేసుకున్నానన్న బాధ చెల్లెలిలో ఉంది. ఎట్టకేలకు అక్కకు మంచి సంబంధం కుదిరింది. ఎంతో ఆనందంగా తన అత్తను తీసుకుని అక్క పెళ్లికి వెళ్లింది చెల్లెలు
Krishna Kowshik
‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసి విరియని ఓ చిరునవ్వా.. కన్నుల ఆశలు నీరై కారగ..కట్నపు జ్వాలలో సమిధై పోయావా’ అని ఓ రచయిత అన్నట్లు.. ఆడ పిల్లకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు కట్నం అవరోధంగా మారింది. పెళ్లి చేసి పంపిస్తున్నా కూడా పెట్టి పోతలు సరిగా లేవని నసుగుతుంటారు అత్తింటి వారు. అలాగే అదనపు కట్నం తీసుకు రావాలంటూ ఇంటికి వచ్చిన కోడల్ని వేధిస్తున్నారు. లక్షల ఖర్చు పెట్టి తండ్రి తనకు వివాహం చేసి ఉండటంతో.. డబ్బులు అడగకుండా ఉండిపోతుంది కూతురు. దీంతో ఆమెను మరింత హింసిస్తుంటారు. కొన్ని సార్లు ఆ వేధింపులు తట్టుకోలేక చావును ఆహ్వానిస్తున్నారు కొంత మంది అమ్మాయిలు.
మూడు నెలలై అయ్యింది యువతికి పెళ్లై. కానీ కట్నం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. పారాణింకా ఆరకుండా కాటికి చేరింది. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని నరసింగంపేట్ గ్రామానికి చెందిన దివ్యరాజ్, ఆరోగ్య సెల్వి దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె జెన్నీఫర్.. మైలాడుతురై జిల్లాకు చెందిన సమీప బంధువు మార్టిన్ రాజ్‌ను ప్రేమించింది. అతడు మలేషియాలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి పెళ్లి గురించి మార్టిన్ తల్లిదండ్రులు జెన్నీ తల్లిదండ్రులతో మాట్లాడగా.. రెండో అమ్మాయికి చేయకుండా మూడో కూతురికి చేయమని చెప్పారు. అయితే పిల్లనిస్తే చాలు.. ఎలాంటి కట్న కానుకలు వద్దని చెప్పడంతో ఫిబ్రవరి 9న జెన్నీఫర్-మార్టిన్ రాజ్ వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకు భర్త మలేషియా వెళ్లిపోయాడు.
ఇదే క్రమంలో ఈ నెల 19న జెన్నీ సోదరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి జెన్నీఫర్, ఆమె అత్త వెళ్లారు. కాగా, సోదరికి గిఫ్టులు ఇవ్వడం చూసిన అత్త.. తట్టుకోలేకపోయింది. వెంటనే కోడలిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. నీ సోదరి పెళ్లి ఘనంగా చేశారని, నీకెందుకు పెట్టిపోతలు ఇవ్వలేదని, సరిగ్గా పెళ్లి చేయలేదని కోడలిపై అరించింది అత్త. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చింది జెన్నీఫర్. అంతలో ఫోన్ కట్ కావడంతో ఆందోళనకు గురైన జెన్నీఫ్ కుటుంబం.. కొడుకును ఇంటికి పంపింది. అక్కడ జెన్నీ స్పృహ కోల్పోయి పడిపోయింది కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయిందని నిర్దారించారు పోలీసులు. కాగా, ఆమె మృతికి కారణమైన అత్తను అరెస్టు చేయడానికి డిమాండ్ చేస్తూ ఆసుపత్రి దగ్గర నిరసన చేపట్టారు. సరైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసన నిలిపివేశారు. అక్క పెళ్లైన కొన్ని గంటలకే చెల్లి శవమై తేలడంతో ఆ ఇంట్లో ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది.