Crime News: అర్థరాత్రి స్వాతి వద్దకు వచ్చిందెవరూ.. పొద్దున్న ఆ స్థితిలో ఆమెను చూసి

అర్థరాత్రి స్వాతి వద్దకు వచ్చిందెవరూ.. పొద్దున్న ఆ స్థితిలో ఆమెను చూసి

రోజు కూలి పనులకు వెళుతూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న మహిళా.. తెల్లాసరికే ఉలుకూ పలుకూ లేకుండా కనిపించింది. ఎంత నిద్ర లేపుతున్నా స్పందన లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల వారికి విషయం చెప్పారు.. తీరా చూస్తే..

రోజు కూలి పనులకు వెళుతూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న మహిళా.. తెల్లాసరికే ఉలుకూ పలుకూ లేకుండా కనిపించింది. ఎంత నిద్ర లేపుతున్నా స్పందన లేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల వారికి విషయం చెప్పారు.. తీరా చూస్తే..

వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఐదుగురు సంతానాన్ని తమ రెక్కల కష్టం మీదే పెంచి పెద్ద చేశారు. పూరి పాకలోనే కాపురం. నలుగురు కుమార్తెలు, ఒక్కగానొక్క కొడుకు. రోజు కూలీ పనులకు వెళ్లి కూతుళ్లకు వివాహాలు చేశాడు తండ్రి. మనస్పర్థల కారణంగా ఓ కూతురు భర్తను వదిలేసి వారి వద్దే ఉంటుంది. ఆమె కూడా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు కూలి పనులకు వెళుతూ ఉండేది. రోజూలానే కూలి పనులకు వెళ్లిన కూతురు అలసి పోయి నిద్ర పోయింది. అయితే తెల్లారేసరికి తండ్రి కూతుర్ని లేపేందుకు ప్రయత్నించగా.. ఆమె ఉలుకూ పలుకూ లేకుండా కనిపించింది. ఏమైందని అనుకునే సరికి జనాలు పోగయ్యారు. తీరా చూస్తే ఆమె చనిపోయినట్లు నిర్దారణ అయ్యింది.

అయితే ఆమె చనిపోవడం వెనుక అనుమానాలు రేగుతున్నాయి. ఇంతకు ఆమె ఎవరు.. ఏమైందంటే.. నల్లొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయి పేట గ్రామానికి చెందిన కొండమీది సైదయ్య, వెంకటమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. నాల్గవ కుమార్తె అయిన స్వాతికి.. నిడమనూరు మండలం ఇండ్ల కొటయ్య గూడెం గ్రామానికి చెందిన వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే వారి కాపురంలో గొడవలు రావడంతో భర్తను వదిలేసి.. పుట్టింటికి వచ్చేసింది. అక్కడే కూలిపనులకు వెళుతూ.. తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. గురువారం రాత్రి కూడా పనులకు వెళ్లి అలసిపోయి వచ్చిన స్వాతి.. మేకల కొట్టంలో ఉన్న మంచంపై పడుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో నిద్రించారు. తెల్లారి తండ్రి నిద్రలేపగా.. ఆమె నుండి ఎటువంటి స్పందన రాలేదు.

దీంతో కంగారు పడ్డ సైదయ్య ఇరుగు పొరుగు పిలిపించగా.. చనిపోయినట్లు నిర్దారించారు. అయితే  గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయన్న తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు. అయితే స్థానికులు చర్చించుకుంటున్న ప్రకారం.. గురువారం అర్థ రాత్రి స్వాతి నిద్రించిన ప్రదేశానికి ఓ వ్యక్తి వచ్చాడని.. అలజడికి నిద్రలేచిన తల్లిదండ్రులు ఎవరని కూతుర్ని అడిగితే.. ఆయన వచ్చారు అంటూ బదులిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనేది తెలిస్తేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుంది. అలాగే ఆమె ఎలా చనిపోయిందన్నది పోస్టుమార్టం నివేదికలో తేలే అవకాశాలున్నాయి. దీంతో ఆ వైపుగా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

Show comments