Vinay Kola
Hospital: కొన్ని ఆసుపత్రులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజరుతున్నాయి. మానవత్వం మరిచిపోతున్నాయి.
Hospital: కొన్ని ఆసుపత్రులు డబ్బుల కోసం ఎంతకైనా దిగజరుతున్నాయి. మానవత్వం మరిచిపోతున్నాయి.
Vinay Kola
రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మంట కలిసిపోతుంది. మనం దేవుల్లాగా కొలిచే డాక్టర్లే రాక్షసులుగా తయారవుతున్నారు. మనం అందరం కూడా ఠాగూర్ సినిమాని కొన్ని వందల సార్లు చూసుంటాం. ఆ సినిమాలో చిరంజీవి ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ చేయమనే సీన్ ఆ సినిమాకే హైలెట్. ఆ సీన్ లో డబ్బు కోసం శవానికి చికిత్స చేసి డబ్బులు గుంజుతారు డాక్టర్లు. అలాంటి సీనే హైదరాబాద్‌లో రిపీట్ అయ్యింది. యిదింకా దానికి మించిన దారుణం అనే చెప్పాలి. ఇలాంటి దారుణాలు చాప కింద నీరులా ఆస్పత్రుల్లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. ఆ హాస్పిటల్ లో నాగప్రియ అనే జూనియర్ డాక్టర్ ఆనారోగ్యంతో చేరింది. పాపం ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ట్రీట్ మెంట్ కోసం కుటుంబ సభ్యులు మూడు లక్షలకుపైగా ఆస్పత్రికి బిల్లు కట్టారు. అంతటితో ఆ ఆస్పత్రి సరిపెట్టుకోలేదు. ఆసుపత్రి యాజమాన్యం ధనదాహం ఆగలేదు. శవాల దగ్గర చిల్లరకు ఆశపడినట్లుగా ఆ హాస్పిటల్ యాజమాన్యం కక్కుర్తి పడింది. డాక్టర్ వృత్తికే సిగ్గు చేటు తెచ్చింది. పేషెంట్ ఒక జూనియర్ డాక్టర్ అని కూడా చూడకుండా మృతదేహం పెట్టుకుని బంధువులతో నీచంగా బేరసారాలకు దిగింది ఆ ఆసుపత్రి యాజమాన్యం. నాలుగు లక్షలు కట్టే డెడ్‌బాడీని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. వైద్యం కోసం ఇప్పటికే మూడు లక్షలు చెల్లించామని ఆ కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నారు. అయినా కానీ ఏ మాత్రం కనికరించలేదు ఆ హాస్పిటల్ నీచులు. మరో లక్ష పట్టుకొస్తేనే బాడీని ఇస్తామంటూ తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా నాగప్రియ కుటుంబసభ్యులు విలపించారు.
చివరకి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో విషయం చెప్పగా ఆస్పత్రి సిబ్బందితో ఫోన్ చేసి మాట్లాడారు. అయినా కూడా ఆ యాజమాన్యం వైఖరి మారలేదు. ఎవరు ఏం చెప్పినా డబ్బులు కట్టి నాగప్రియ మృతదేహం తీసుకెళ్లాలంటూ రక్షసుల్లా ప్రవర్తించారు. డాక్టర్లు డబ్బుల కోసం కావాలనే వైద్యం ఆపేశారని, అందు వల్లనే నాగప్రియ చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఇంకా దారుణం ఏంటంటే అసలు డబ్బులు కట్టేంత వరకు చనిపోయిన విషయం కూడా చెప్పలేదట. ఇంత దారుణానికి పాలపడ్డ ఆస్పత్రిపై యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆస్పత్రి ఎదుట కూర్చున్నారు. ఇంత జరిగినా కూడా ఆస్పత్రి సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దారుణమైన ఘటనపై పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ విషాదకరమైన సంఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.