Wagh Bakri Tea Group Parag Desai-Stray Dog Attack: ప్రముఖ వ్యాపారవేత్తపై వీధి కుక్కల దాడి.. చికిత్స పొందుతూ మృతి

ప్రముఖ వ్యాపారవేత్తపై వీధి కుక్కల దాడి.. చికిత్స పొందుతూ మృతి

కొన్ని రోజుల క్రితం వరకు రాష్ట్రంలో వీధి కుక్కల పేరు వినబడితే చాలు జనాలు భయంతో వణికిపోయేవారు. ఇక వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందారు. ఆ వివరాలు.. 

కొన్ని రోజుల క్రితం వరకు రాష్ట్రంలో వీధి కుక్కల పేరు వినబడితే చాలు జనాలు భయంతో వణికిపోయేవారు. ఇక వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందారు. ఆ వివరాలు.. 

వీధి కుక్కల పేరు విన్నా.. ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కుక్కలు కనిపించినా సరే.. జనాలు తీవ్రంగా భయపడే పరిస్థితులు ఉండేవి. ఇక తెలంగాణలో అయితే కొన్ని రోజుల క్రితం వరకు వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. అంతేకాక వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్‌ మృతి చెందడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడి ఘటనలు వెలుగు చూశాయి. ఇక తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు వీధి కుక్కల దాడిలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ఆ వివరాలు..

ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడం వల్ల ఆయన మృతి చెందినట్లు.. కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరాగ్‌ దేశాయ్‌కు భార్య విదిశ, కూతురు పరిషా ఉన్నారు. మరి ఆయన ఆప్పత్రిలో ఎందుకు చేరారంటే.. అక్టోబర్‌ 15న ఆయన ఇంటి సమీపంలోనే వీధి కుక్కలు పరాగ్‌పై దాడి చేయడం వల్ల కింద పడ్డాడని స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలో పరాగ్‌ తలకు గాయమైందని.. దాంతో వెంటనే పరాగ్‌ని సమీపంలోని షెల్బీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ తర్వాత సర్జరీ కోసం జైడస్ హాస్పిటల్‌కు తరలించారని వెల్లడించారు. ఆ సమయంలోనే మెదడులో రక్తస్రావం వల్ల ఏడు రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ.. చివరకు ఆదివారం నాడు అనగా.. అక్టోబర్ 22న పరాగ్‌ తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు.

పరాగ్‌ ఇంటికి సమీపంలోనే.. ఆయనపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. ఆయన కింద పడ్డట్లు పరాగ్‌ సన్నిహితులు తెలిపినట్లు.. జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక భద్రతా సిబ్బంది వచ్చి సమాచారం ఇవ్వడంతో.. వెంటనే పరాగ్‌ కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పరాగ్ దేశాయ్ మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో పరాగ్ దేశాయ్ ఒకరు. ఆయన తండ్రి పేరు రాసేశ్ దేశాయ్. కంపెనీని ఈ-కామర్స్‌లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కంపెనీ సెల్స్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్ట్ విభాగాల కార్యకలాపాలను పరాగ్ పర్యవేక్షించేవారు. పరాగ్ దేశాయ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. వాఘ్ బక్రీ గ్రూప్‌ను 1892లో నరన్‌దాస్ దేశాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2000 కోట్లు. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాఘ్ బక్రీ టీ గ్రూప్ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Show comments