పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన ధర!

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన ధర!

బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. గత రెండు రోజులుగా పెరిగిన పసిడి ధర.. నేడు ఉన్నట్లుండి భారీగా దిగి వచ్చింది. బులియన్‌ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు చూస్తే.. అసలు బంగారం కొనాలో, వద్దో అర్థం కావడం లేదు. మరి కొన్ని రోజుల్లో శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. అప్పుడు పుత్తడికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మరి అప్పుడు ధర ఎంత పెరుగుతుందో చెప్పలేం. దాంతో బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తే మంచిది అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం సెషన్‌లో పుత్తడి ధర దిగి వచ్చింది. కానీ మన దగ్గర పెరిగింద. ఇక వెండి ధర కూడా అలానే ఉంది. అయితే శనివారం మాత్రం మన దగ్గర బంగారం ధర భారీగానే దిగి వచ్చింది. మరి నేడు హైదరాబద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధర ఎంత ఉంది అంటే…

నేడు బంగారం ధర దిగి వచ్చింది. 10 గ్రాముల మీద రూ. 300 తగ్గింది. క్రితం సెషన్‌లో 22 క్యారెట్‌ పది గ్రాముల పసిడి రేటు 55,700గా ఉండగా.. రూ.300 తగ్గి నేడు రూ. 55,400కి చేరింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 55,400 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా దిగి వచ్చింది. నేడు 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 310 రూపాయలు తగ్గి.. 60,440వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 55,550గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,590గా ఉంది.

నేడు దేశీయంగా బంగారం ధర దిగి వస్తే.. వెండి రేటు మాత్రం పెరిగింది. సిల్వర్‌ రేటు నేడు కిలో మీద ఏకంగా రూ.600 పెరిగి.. భారీ షాకిచ్చింది. ఇక నేడు దేశీయ మార్కెట్‌లో అంటే ఢిల్లీలో కిలో వెండి ధర రూ.600 పెరిగి 79వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెడి ధర 82 వేల రూపాయలు పలుకుతోంది. శుక్రవారం కిలో వెండి ధర 78400 రూపాయలుగా ఉంది.

Show comments