పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోతున్న బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోతున్న బంగారం, వెండి ధరలు

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరే శుభవార్త అని చెప్పవచ్చు. గత కొన్నాళ్లుగా పెరుగుతూ, తగ్గుతూ వినియోగదారులతో దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు మళ్లీ పతనం దిశగా పయనిస్తున్నాయి. ఇక నిన్నటి సెషన్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండగా.. నేడు కూడా గోల్డ్‌, సిల్వర్‌ రేట్లలో ఎలాంటి మార్పుల లేదు. నేడు దేశీయంగా బంగారం ధర స్థిరంగా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్లోనూ వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఇక రానున్న రోజుల్లో వెండి, బంగారం ధరలు భారీగా దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా డిమాండ్‌ తగ్గడం వంటి కారణాల వల్ల రానున్న రోజుల్లో పసిడి ధర పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచాన వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీలో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు ఇంటర్నేషనల్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం తగ్గినప్పటికి మన దగ్గర మాత్ర పసిడి ధర నిన్నటిలానే స్థిరంగా కొనసాగుతుంది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 55,150 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 60,160 వద్ద ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,300 పలుకుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 60,130 పలుకుతోంది.

మళ్లీ పడిపోయిన వెండి ధర..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర మాత్రం కాస్త దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 200 పడిపోయింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 78,300 మార్క్ వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూస్తే కిలో వెండి ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుత హస్తినలో కిలో వెండి రేటు రూ. 75 వేల మార్క్‌కు దిగివచ్చింది. ఇక నేడు అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారం ధర క్రితం సెషన్లలో పెరగ్గా.. ఇవాళ మాత్రం భారీగా దిగి వచ్చింది. దాదాపు ఔన్సుకు 10 డాలర్ల వరకు దిగివచ్చింది ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు 1936 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.11 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

Show comments