మళ్లీ రెండు రోజుల మురిపమే.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై చూపిస్తున్నాయి.

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై చూపిస్తున్నాయి.

దేశంలో కొంత కాలంగా బంగారం ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి. దీనికి గల కారణం బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు తప్పకుండా పసిడి కొనుగోలు చేయడం సంప్రదాయంగా మారింది. దీంతో బంగారం ధరలు ప్రతిరోజూ పెరిగిపోతూ వస్తున్నాయి. కొన్నిసార్లు తగ్గినా అది రెండు రోజుల మురిపంగానే ఉంటుంది. గత పది రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోదారుల శాతం పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణమాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మొన్నటి వరకు తగ్గిన పసిడి మళ్లీ పెరిగిపోయింది. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. గత వారం రోజుల్లో తగ్గుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం ఆభరణాలు గానే కాకుండా ఇతర అవసరాలకు పనికి వస్తుందని భావించి ఈ మధ్య మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా దీనిపై ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. ఫంక్షన్లలో ఆభరణాలుగా.. అత్యవసర పరిస్థితుల్లో పెట్టుబడిగా బంగారం పనికి వస్తుంది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అయోమయంలో ఉంటున్నారు కొనుగోలుదారులు. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి నేడు మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220కిపెరిగింది.

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,050 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66,050 వద్ద ట్రెండ్ అవుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66,200 వద్ద ట్రెండ్ అవుతుంది.ముంబై, కేరళా, కల్‌కతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,050 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66,050 వద్ద ట్రెండ్ అవుతుంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,110 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.66100 వద్ద ట్రెండ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1000 వరకు పెరిగి రూ.87,600 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,000 ఉంది. ముంబై రూ.84,100, బెంగుళూరులో రూ.82,500 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.87,500 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments