P Krishna
P Krishna
దేశంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత బంగారం కొనాలనే ఆశ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో వరుసగా బంగారం రేట్లు పెరిగిపోవడంతో సామాన్యులకు పెనుభారంగా మారింది. కానీ గత నెల నుంచి రోజు రోజుకీ బంగారం రేట్లు తగ్గిపోతూ వచ్చాయి. ఏకంగా మూడు వేల రూపాల వరకు తగ్గుముఖం పట్టింది. నిన్నటి వరకు బంగారం తగ్గుతూ వచ్చినా.. ఈ రోజు కొంత వరకు షాక్ ఇచ్చింది. శనివారం బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..
గత నెల నుంచి బంగారం, వెండి ధరలు ఒకటీ రెండు రోజులు స్థిరంగా ఉన్నా.. చాలా వరకు తగ్గుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా బంగారం కొనుగోలు జోరందుకుంది. బంగారం తగ్గుతూ రావడంతో కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.57,230 వద్ద కొనసాగుతుంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు ధర రూ.57,380 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.52,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.57,650 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. స్వల్పంగా తగ్గింది. కిలో రూ.500 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 73,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ లో రూ.70,600, చెన్నైలో రూ.73,000 కొనసాగుతుంది.