మహిళలకు అదిరిపోయే శుభవార్త..వరుసగా తగ్గుతున్న బంగారం ధర..ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: ప్రస్తుతం దేశంలో పండగలు, శుభకార్యాల సీజన్ నడుస్తుంది. గ్రామాలు, పట్టణాలు కలకలలాడుతున్నాయి. ఇలాంటి సీజన్ లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల వరుసగా షాక్ ఇచ్చిన పసిడి, వెండి తగ్గుముఖం పట్టాయి.

Gold and Silver Rates: ప్రస్తుతం దేశంలో పండగలు, శుభకార్యాల సీజన్ నడుస్తుంది. గ్రామాలు, పట్టణాలు కలకలలాడుతున్నాయి. ఇలాంటి సీజన్ లో మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల వరుసగా షాక్ ఇచ్చిన పసిడి, వెండి తగ్గుముఖం పట్టాయి.

బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన లోహం బంగారం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి అంటే ఎంతో మక్కువ చూపిస్తుంటారు. ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటే ధైర్యంగా ఉంటుంది.. ఏ కష్టమొచ్చినా అది ఆదుకుంటుందన్న నమ్మకం మధ్యతరగతి కుటుంబాల వారు నమ్ముతారు. అందుకే ఇటీవల ఎక్కవగా పొదుపు చేసిన డబ్బు బంగారం కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతన్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో జరుగుతున్న యుద్దాలు కారణంగా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో తరుచూ ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో ఎలాంటి శుభకార్యాలైనా.. పెద్ద పెద్ద పండుగులైనా మహిళలు పసిడి కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు వెళ్తుంటారు. ఎందుకంటే బంగారం మన సంస్కృతి, సంప్రదాయాలతో పెనవేసుకుపోయింది.ఇటీవల బంగారం కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు భవిష్యత్ లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి అత్యవసరంగా పసిడి పనికివస్తుందన్న మధ్యతరగతి కుటుంబీకులు నమ్ముతున్నారు. అందుకే పసిడిపై ఎక్కువగా పెట్టుబడి పెడ్డుతున్నారు. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి.గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.67,690 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.73,840కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.73,840 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,840ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.73,990 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,440 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.73,840 వద్ద కొనసాగుతుంది. వెండి రేటు రూ.100 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,900,ఢిల్లీ, ముంబై, పూనే,కోల్‌కొతాలో రూ.91,400, బెంగుళూరులో రూ.91,450 వద్ద కొనసాగుతుంది.

Show comments