Gold&Silver Rate On Sep 11th 2023: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.. నేడు ఎంత ఉందంటే

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.. నేడు ఎంత ఉందంటే

పసిడి ధరలు స్థిరంగా ఉండవు. అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా ధర పెరగడం, తగ్గడం ఉంటుంది. మన దేశంలో బంగారానికి డిమాండ్‌ భారీగా ఉన్నప్పటికి.. మన దగ్గర ఉత్పత్తి తక్కువ. విదేశాల నుంచి భారీగా దిగుబడి చేసుకుంటాం. దాంతో మన దగ్గర పసిడి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పండగల సీజన్‌ కావడంతో.. గోల్డ్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. దాంతో ధర కూడా పెరుగుతుంది. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర.. నేడు మాత్రం స్థిరంగా ఉంది. ఆదివారం (సెప్టెంబర్‌10)తో పోల్చితే నేడు అనగా సోమవాంర బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి ధర రూ.54,850 వద్ద ట్రేడవుతుంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్చమైన బంగారం ధర రూ.59,840 వద్ద స్థిరంగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు పసిడి ధర స్థిరంగా కొనసాగింది. నేడు హస్తినలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110 వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా వెండి ధర..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. సిల్వర్‌ ధర స్థిరంగా కొనసాగుతుంది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ట్రేడవుతోంది. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మీటింగ్‌ దగ్గర పడుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి కదలిక తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,942.70 డాలర్ల వద్ద ఉంది.

Show comments