బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి!

బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి!

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కాని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు వరసగా దిగి వస్తే.. ఆపై వారం రోజుల పాటు పెరుగుతుంది. పైపైకి ఎగబాకుతున్న పసిడి ధర చూసి బంగారం కొనాలనుకునేవారు వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు.. శ్రావణమాసం ప్రారంభం కానుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉండటంతో.. పసిడికి డిమాండ్‌ పెరిగి.. ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుందేమో అని భయపడుతున్నారు. అయితే.. పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు మార్కెట్‌ విశ్లేషకులు. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్రితం సెషన్‌లో అనగా.. ఆదివారం నాడు హైదరాబాద్‌ మార్కెట్లో తులం బంగారం రేటు రూ. 200 పెరిగిన విషయం తెలిసిందే. కానీ నేడు అనగా సోమవారం మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 55,150 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ. 60,160 వద్ద ట్రేడవుతోంది. ఇక అలానే నేడు ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర స్థిరంగానే ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల రేటు రూ. 55,300 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ. 60, 310 వద్ద ఉంది.

స్థిరంగా వెండి ధరలు..

బంగారం సంగతి ఏమో కానీ.. గత నాలుగు రోజులుగా వెండి ధర భారీగా దిగి వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో ఏకంగా కిలో వెండి రేటు రూ.2800 దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే క్రితం సెషన్‌లో అనగా ఆదివారం నాడు వెండి ధర కాస్త పుంజుకున్నట్లు కనిపించినా ఇవాళ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రేటు మన హైదరాబాద్‌లో రూ. 78,500 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు నిన్న రూ. 300 పెరిగింది. కానీ సోమవారం నాడు వెండి ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ. 75,100 వద్ద ఉంది.

గ్లోబల్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కారణంగా బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1944.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు స్థిరంగా ఉండి.. ఔన్సుకు 23.61 డాలర్ల వద్ద ఉంది.

Show comments